ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, జగన్ మోహన్ రెడ్డి పార్టీలో తన పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన వారిని వదిలి పెట్టేది లేదని పట్టుదలగా ఉన్నారు. ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయటం కాదు, వారిని వెంటాడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్న వారికి పది రోజుల క్రిందట ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి వాయించి పడేసారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, తన పై నిరాదర ఆరోపణలు చేసిన వారి పై పరువు నష్టం దావా వేస్తున్నట్టు చెప్పారు. అయితే ఆయన అధికారి కావటంతో, పరువు నష్టం దావా వేయాలి అంటే, ప్రభుత్వ అనుమతి తప్పనిసరి, అందుకే దీని పై వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ విషయం పైన, పరువు నష్టం దావా వేయటానికి, తనకు అనుమతి కావాలి అంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. మరి అక్కడ నుంచి ఏ అనుమతి వచ్చిందో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన సాధారణ పరిపాలనశా ఖకు లేఖ, ఇదే అంశం పై లేఖ రాసారు. తనను మీడియాలో అప్రతిష్ట పాలు చేసి, తన పరువుకు భంగం కలిగించి, తన పై వ్యాఖ్యలు చేసి తనను రాజకీయంగా వాడుకుని, లబ్ది పొందతున్న వారి పైన తాను పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు.
మొత్తం ఐదుగురిపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నానని, పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి కావాలని కోరుతూ సాధారణ పరిపాలనా శాఖకు లేఖ రాసారు. తన పైన తప్పుడు ఆరోపణలు చేసారని, ఆ లిస్టు లో ఉన్న వారి పేర్లు చెప్పారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పరువు నష్టం దావా వేయాలని దానికి అనుమతి కోవాలని కోరుతూ లేఖ రాసారు. అలాగే సాక్షి పత్రిక, సాక్షి టీవీపైన కూడా పరువునష్టం దావా వేయాలని, దానికి కూడా అనుమతి కోరుతూ లేఖలో తెలిపారు. అలాగే సీఎం సీపీఆర్వో శ్రీహరిపై కూడా పరువు నష్టం దావా వేయాలని, అతను తన సస్పెన్షన్‍పై మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని, మీడియాకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేష లో తప్పుడు ఆరోపణలు చేసారని, అయితే శ్రీహరి ప్రచారం చేసిన విషయాలు మాత్రం, తన సస్పెన్షన్ జీవోలో ఎక్కడా లేవని ఏబీవీ తెలిపారు. మీడియా కథనాలు తన కుటుంబ సభ్యులకు బాధ కలిగించాయని, వీరి పైన పరువు నష్టం దావాకు అనుమతి కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఎలాగూ అనుమతి ఇవ్వదు కాబట్టి ఆయన ఏమి చేస్తాడో చూడాలి మరి.