గత తెలుగుదేశం హయాంలో ఇంటలిజెన్స్ డిజిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాంగానే సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ ఆయన అప్పట్లో కోర్ట్ ని ఆశ్రయించారు. అయితే తాజాగా దీని పై సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. అయన పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు, ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసి నెల అయినా ఇప్పటివరకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్తే ఇబ్బంది అని గ్రహించి, తాజాగా ఆయనకు ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‍గా పోస్టింగ్ ఇచ్చింది. కాని అంత పెద్ద హోదాలో పని చేసిన ఆయనకు ఇలాంటి పోస్టింగ్ ఇవ్వటం పై, ప్రబుత్వం సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటోంది.
Advertisements