వైఎస్ వివేక కేసులో రోజు వస్తున్న వార్తలు, ఈ కేసులో జరిగిన పరిణామాల గుట్టు విప్పుతున్నాయి. సిబిఐ దూకుడు పెంచటంతో, అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. వివేకా వాచ్మెన్, వివేక డ్రైవర్, సిఐ, ఇలా అనేక మంది స్టేట్మెంట్లు ఇస్తుంటే, ఇవన్నీ సిబిఐ కావాలని చెప్పిస్తుంది అంటూ, వైసీపీ ఎదురు దా-డి చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు సొంత కుటుంబం నుంచే ఇలాంటి వ్యాఖ్యలు వస్తూ ఉండటంతో, వైసీపీ డిఫెన్సు లో పడుతుంది. నిన్న సొంత కుటుంబంలో పెద్ద వైఎస్ ప్రాతప్ రెడ్డి, ఆ రోజు జరిగిన విషయాలు అన్నీ సిబిఐకి చెప్పిన స్టేట్మెంట్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో అనేక విషయాలు ఉన్నాయి. గుండెపోటు ఎపిసోడ్ మొత్తం నడిపించింది అవినాష్ రెడ్డి అని ఆయన చెప్పారు. అలాగే రక్తం మరకలు తుడిచి వేయటం, కుట్లు వేయటం లాంటి విషయాలు కూడా సిబిఐకి చెప్పారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం అవినాష్ నడిపించారు అనే విధంగా ఆయన స్టేట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచే మరో వ్యక్తి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది. అవినాశ్‌రెడ్డి పెదనాన్న మనవడు వైఎస్ అభిషేక్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆయన సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో అనేక విషయాలు ఉన్నాయి.
ఆ రోజు వివేక ఇంటికి ఉదయాన్నే వెళ్లానని అభిషేక్ రెడ్డి సిబిఐకి చెప్పారు. గుండె నొప్పి వచ్చి చనిపోయారని ఫోన్ చేసారని అభిషేక్ రెడ్డి చెప్పారు. అయితే వివేక ఇంటికి వెళ్ళినప్పుడు బయట కొంత మంది వ్యక్తులు ఉన్నారని, అవినాష్ రెడ్డి ఫోన్ లో మాట్లాడుతున్నారని, ఇంటి లోపలకు వెళ్లి చూస్తే, బెడ్ రూమ్ లో రక్తం ఉందని, బాత్ రూమ్ లో వివేక బాడీ ఉందని అన్నారు. ఆయన రక్తపు మడుగులో ఉన్నారని, వివేక నుదిటి పైన తీవ్రమైన గాయాలు ఉన్నాయని అన్నారు. అయితే అక్కడ సీన్ చూస్తే ఎక్కడ గుండె పోటు వచ్చి చనిపోయినట్టు లేదని, ఎందుకు గుండె పోటు అని ప్రచారం చేసారో అర్ధం కాలేదని అన్నారు. అయితే అక్కడే రక్తం తుడిచి, కుట్లు కూడా వేసారని సమాచారం వచ్చిందని, ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాలేదని అన్నారు. ఆ రోజే ఒక టీవీ ఛానల్ లో లైవ్ లో మాట్లాడిన తాను, దీని పై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, సిబిఐ ఎంక్వయిరీ వేయమని అడిగినట్టు చెప్పారు. అసలు గుండెపోటు అని ఎందుకు చెప్పారో అర్ధం కావటం లేదని అభిషేక్ రెడ్డి తెలిపారు.