ఆంధ్రప్రదేశ్ లో బ్లూమీడియా చేసే మాయ అంతా ఇంతా కాదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించటం, ఆ బ్లూ మీడియా స్టైల్. వాళ్ళే తప్పులు చేస్తారు. ఆ తప్పులను ఎదుటి వాళ్ళ మీదకు ఆపాదించి, బురద చల్లుతారు. బ్లూ మీడియాలో వచ్చే అంశాలు, సోషల్ మీడియాలో పేటీయం బ్యాచ్ తీసుకుని, ప్రజలను మభ్య పెట్టి, నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి సంఘటనే నిన్న జరిగింది. ఏపి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంటి మీదకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే లక్ష్మీనారాయణ తన స్నేహితుడు కావటంతో, ఏబీఎన్ రాధాకృష్ణ అక్కడకు వెళ్లారు. అలాగే లక్ష్మీనారాయణ బంధువు అయిన పయ్యావుల కేశవ్ కూడా అక్కడకు వచ్చారు. ఇంకేముంది బ్లూ మీడియా రెచ్చిపోయింది. టిడిపి గ్యాంగ్ హాల్ చల్ అంటూ కధనాలు వండి వార్చింది. ఏబీఎన్ రాధాకృష్ణ, సిఐడి అధికారులను అడ్డుకున్నారని, లోపలకు రానివ్వటం లేదు అంటూ, కధనాలు రాసింది. టీవిలో వేయటమే కాక, తమ బులుగు పత్రికలో కూడా ఇదే రాసాయి. దీంతో కొంత మందికి కూడా ఇదే నిజం అని నమ్మారు. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ, ఏబీఎన్ యాజమాన్యం, అసలు నిజాలు, వీడియోలు రూపంలో బయటకు వదిలి, బ్లూ మీడియా ప్రచారాన్ని తిప్పి కొట్టింది.
అక్కడ జరిగిన సంఘటనను, కొన్ని మీడియా చానల్స్ వీడియో తీసాయి. ఆ వీడియోలు పరిశీలిస్తే, ఎక్కడా రాధాకృష్ణ సిఐడి అధికారులను అడ్డుకున్నట్టు లేదు. మీరు ఎందుకు అరుస్తారు, సిఐడి అధికారులకు సహకరించండి, వారే పని చూసుకుని వెళ్ళిపోతారు అని రాధాకృష్ణ చెప్పిన మాటలు స్పష్టంగా వీడియోలు ఉంది. అయినా అప్పటికే సిఐడి అధికారులు లోపల ఉన్నారు. మరి రాధాకృష్ణ అడ్డుకోవటం ఏమిటో, బ్లూ మీడియాకే తెలియాలి. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, మీరు వారితో వాదన పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. మీరు వారికి సహకరించండి అని చెప్పారు. దీంతో అక్కడ పరిస్థితి కూల్ అయ్యింది. అలాగే సిఐడి అధికారులు కూడా, మీరు ఇక్కడే కొద్ది సేపు ఉండండి, మీరు ఉంటే వాళ్లు సహకరిస్తారు అంటూ సిఐడి అధికారులు రాధాకృష్ణతో చెప్పిన మాటలు కూడా వీడియోలో ఉన్నాయి. నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అని ఆర్కే చెప్పగా, అవసరం లేదు మీరు ఉండండి, మా పనికి ఇబ్బంది లేదు అని సిఐడి అధికారులు అన్నారు. దీంతో ఈ వీడియో విడుదల చేసిన రాధాకృష్ణ, దీనికి ఏమి సమాధానం చెప్తారు అంటూ, బ్లూ మీడియాను ఛాలెంజ్ చేసారు.