ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న కొంత మంది పెద్దల అత్యుత్సాహం, ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది. రఘురామకృష్ణం రాజు, ప్రతి రోజు రాజధాని రచ్చబండ పేరుతో తమను విమర్శిస్తున్నారనే కక్షతో, ఏకంగా ఆయన పై రాజ ద్రోహం కేసు నమోదు చేసారు. అయితే ఆయన్ను అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు చేసిన అనేక తప్పిదాలతో, ఇప్పటికే ఈ రోజు మధ్యానం ఏపి హైకోర్టు అక్షింతలు వేసింది. సిఐడి చీఫ్ సహా అనేక మంది పై కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, ఇదే కేసులో రఘురామకృష్ణం రాజు వీడియోలు పదే పదే వేస్తున్నారు అంటూ, ఏకంగా రెండు తెలుగు చానల్స్ అయిన ఏబిఎన్, టీవీ5 పై కూడా రాజద్రోహం కేసు నమోదు అయ్యింది. అయితే దీని పై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సుప్రీం కోర్టులో, కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ని ప్రతి వాదులగా చేర్చింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పాటించకుండా, మీడియాను భయపెట్టేలా కేసులు పెట్టారని, ఆ పిటీషన్ లో పేర్కొంది. క-రో-నా సంబంధించిన వార్తలు అడ్డుకోకూడదు అని సుప్రీం కోర్టు చెప్తే, రఘురామరాజు క-రో-నా వైఫల్యాల పై మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు కూడా రాజద్రోహం కేసు పెట్టారని పిటీషన్ లో తెలిపింది. ఈ పిటీషన్ త్వరలోనే విచారణకు రానుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read