దాదాపుగా 2004 వరకు రాజకీయాలు సక్రమంగా నడిచేవి. ఒకరి పై ఒకరి వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా, అవి ఒక పధ్ధతిగా మాత్రమే ఉండేవి. ఎక్కడా లైన్ దాటే వాళ్ళు కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, సమాజాన్ని కుల ప్రాతిపదిక విడగొట్టటం మొదలు పెట్టారు. అలాగే ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలు దెబ్బ తీయటం, ప్రత్యర్ధులను మానసికంగా కుంగదీయటం, ఇలా అనేక ఫ్యాక్షన్ తరహా పోలిటిక్స్ నడిపేవారు. అక్కడ మొదలైన దిగజారుడు, ఇప్పుడు పాతాళానికి దగ్గరలో ఉంది. రాజకీయాలు అంతలా దిగజారి పోయాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి తనకు వ్యతిరేకం అని ప్రజలకు ఎక్కించి, సాక్షి ఛానల్ పెట్టారు. అప్పట్లో రామోజీ రావుని కుంగదీయటానికి, రామోజీ కొడుకు చేత సాక్షిలో ఇంటర్వ్యూ ఇప్పించి, రామోజీ రావు ఫ్యామిలీ గొడవలు అందరికీ తెలిసే లా చేసి రచ్చ రచ్చ చేసి, అప్పటి వైసీపీ బ్యాచ్ ఆనంద పడింది. ఇప్పటికీ ఆ వీడియోలు తిప్పుతూ వైసీపీ ఆనంద పడుతూ ఉంటుంది. అలాగే చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, హరికృష్ణ చేత సాక్షిలో మాట్లాడి, 2014 ఎన్నికల ముందు తిట్టించారు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. భూమి ఎప్పుడూ గుండ్రంగా ఉంటుంది. మన టర్న్ రాక తప్పదు. ఇవాళ కాకపొతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు అదే రోజు వైసీపీకి వచ్చింది.
జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు ఎంత పెద్ద శత్రువో, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అంత పెద్ద శత్రువు. ఏబీఎన్ ఛానల్ ని వైసీపీ బ్యాన్ చేసింది. ఒకానొక సమయంలో ఏపిలో కూడా వైసీపీ బ్యాన్ చేసింది. అలాంటి రాధాకృష్ణ ఏబీఎన్ స్టూడియోలో, అదే రాధాకృష్ణ ముందు జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూర్చుని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు అది ప్రసారం కానుంది. ఏపి మొత్తం ఈ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ లో, వైఎస్ వివేక మరణం, జగన్ తనను మోసం చేసిన తీరు, సజ్జల సంబంధం లేదు అని చెప్పిన వ్యాఖ్యలు, ఇలా అనేక విషయాల పై షర్మిల మాట్లాడనున్నారు. అన్నటికంటే మించి రాధాకృష్ణ, షర్మిలను షమ్మి అని పిలుస్తూ, జగన్ గుండెల్లో గునపాలు గుచ్చారనే చెప్పాలి. గతంలో ప్రత్యర్ధుల పై ఏ అస్త్రం ప్రయోగించారో, ఇప్పుడు కూడా అదే అస్త్రం, జగన్ మీదకు ప్రయోగించబడుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. శాస్వత మిత్రులు, శత్రువులు ఉండరు, అలాగే మనం ఏమి చేస్తామో, అదే తిరిగి మనకు వస్తుంది. ఈ ఇంటర్వ్యూ తరువాత ఎన్ని సంచలనాలు ఉంటాయో చూద్దాం.