ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాసిన కొత్త పలుకుపై వైకాపా ఉలుకు లేదు ఎందుకో అనుకున్నారంతా. ఆర్కే రాసింది ప్రతీ అక్షరమూ అక్షరసత్యమని సీబీఐ సీఎం సలహాదారుడు అజయ్ కల్లంని విచారించడంతో తేలిపోయింది. వివేకాని చంపేసిన రోజు వేకువజామున జగన్ తో నలుగురు భేటీ అయ్యారని, ఆ నలుగురి పేర్లు కూడా రాసిన తెగువ ఆర్కేది. ఆ నలుగురితో మాట్లాడుతుండగానే వివేకా చనిపోయారనే ఫోన్ వచ్చిందని, ఆ విషయం ఆ నలుగురికీ తెలుసని రాధాకృష్ణ మర్డర్ కేసు మిస్టరీ గుట్టు విప్పేశారు. దీనిపై సీఎం సలహాదారుడు కల్లం అజయ్ రెడ్డిని సీబీఐ విచారించిందని మరో కథనం రాశారు. ఇదీ నిజమేనని ఆ సలహాల రెడ్డి గారు ఒప్పుకోవడం ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ అక్షరసత్యం రాస్తున్నారని స్పష్టమైంది. మీడయాతో మాట్లాడిన కల్లం అజయ్ రెడ్డి సీబీఐ అధికారులు తనను కలిసి మాట్లాడారని, నాకు తెలిసిన సమాచారం చెప్పానని, వివేకా మరణించిన విషయం జగనే మాకు చెప్పారని క్లారిటీ ఇచ్చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారనే విషయాన్ని మాత్రం ఆ రోజు ఉన్న నలుగురితో చెప్పారని, వారిలో నేనొకడిని అని చెప్పుకొచ్చారు. వివేకా చనిపోయారని చెప్పారట కానీ, సమయం గుర్తులేదట కల్లం అజయ్ రెడ్డి గారికి. వివేకా హత్య కేసు అంశాలను వక్రీకరించడం, దర్యాప్తు అంశాలు లీకవడం కూడా సరికాదని, సీబీఐకి తాను చెప్పిన విషయాలను వక్రీకరించి ఇష్టమొచ్చినట్టు రాశారని కల్లం అజయ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు
ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఆర్కే పెనుసంచలనం-వివేకా హత్యలో రాసినవన్నీ నిజాలే
Advertisements