ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంలో, కేంద్రంతో పాటు, తెలంగాణా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, సుప్రీం ముందు దోషిగా చూపెట్టే ప్రయత్నం చేసారు. అయితే, వీరికి దీటుగా ఏపి తరుపు లాయర్లు సమాధానం ఇచ్చారు. ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా, హైకోర్టు భవనాలు ఎప్పుడు పూర్తి అవుతాయని సుప్రీం ప్రశ్నించగా, డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది నారీమన్ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టమని, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

supreme 01102018 2

అయితే ఇదే సందర్భంలో, కేంద్రం, తెలంగాణా తరుపు న్యాయవాదులు మన రాష్ట్రాన్ని ఇరికించే ప్రయత్నం చేసారు. మూడేళ్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే విషయాన్ని చెబుతూ వస్తుందని, ఆలస్యానికి కారణాలేంటని కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఉన్నతన్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తగిన విధంగా సమాధానం ఇచ్చారు ఏపి న్యాయవాదులు. తగిన నిధులు లేకపోవడం వల్లే హైకోర్టు భవన నిర్మాణం ఆలస్యమైందని నారీమన్ తెలిపారు. కేంద్రం నుంచి సరైన సహకారం రాలేదని చెప్పారు.

supreme 01102018 3

ఈ నేపధ్యంలో జోక్యం చేసుకున్న కేంద్ర తరపున లాయర్, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, అందులో హైకోర్టుకు కూడా కొన్ని నిధులు కేటాయించినట్లు కేంద్రం తరపు న్యాయవాదులు తెలియజేశారు. అయితే ఇవి ఎప్పుడు ఇచ్చారని ? మూడేళ్ళ క్రిందట ఇచ్చారా ? ఏడాది క్రితం ఇచ్చారా అని ఏపి తరుపు లాయర్ ప్రశ్నిస్తూ, ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నామని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది నారీమన్ తెలియజేశారు. వాదనలు వినన కోర్ట్, దీనిపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read