నోరు తెరిస్తే ప్రజాస్వామ్యం, స్వేఛ్చ అంటూ మాట్లాడే బీజేపీ నేతలు, ముఖ్యంగా అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే మన ప్రధాని గారు, ఇప్పుడు మీడియా అంటే భయపడి పోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తమకు వ్యతిరేకంగా వార్తా వస్తే తట్టుకోలేక పోతున్నారు. తమకు వ్యతిరేకంగా, పేపర్ లో కాని, ఛానల్ లో కాని వార్తా వచ్చింది అంటే, చిందులు వేస్తున్నారు. తాజాగా, ఇలాగే బీజేపీకి, అదీ మోడీకి వ్యతిరేకంగా వార్తా రావటంతో, బీజేపీ పెద్దలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరకు, వీరి ఆగ్రహానికి ఆ ఛానల్ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌, యాంకర్‌ ఉద్యోగాలు ఊడిపోయాయి. వాళ్ళు ఏమి, మోడీని బూతులు తిట్టలేదు, బీజేపీ పార్టీ గురించి, అనకూడని మాటలు ఏమి అనలేదు.

modi 07082018 02

మోడీ ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ఫేక్ ప్రచారం బయట పెట్టారు అంతే. దీని కోసమే ఉద్యోగం పోగొట్టుకుంది, ప్రముఖ హిందీ వార్తా చానెల్‌ ఏబీపీ న్యూస్‌ ఎడిటర్‌ ఇన్‌చీఫ్‌ మిళింద్‌ ఖండేకర్‌, మాస్టర్‌ స్ట్రోక్‌ షో యాంకర్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పాయ్‌. వీరిద్దరూ రాజీనామా చేసినట్లు యాజమాన్యం ప్రకటన చేసినా, నిజానికి ఆ ఛానల్ యాజమాన్యం బలవంతంగా వెళ్లగొట్టినట్లు భావిస్తున్నారు. జూన్‌ 20న ప్రధాని మోదీ వీడియో లింక్‌ ద్వారా వివిధ ప్రాంతాల రైతులతో మాట్లాడారు. ప్రధానితో మాట్లాడిన రైతుల్లో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రానికి చెందిన మహిళా రైతు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తన ఆదాయం రెట్టింపు అయిందని ఆమె ప్రధానికి తెలియజేసింది. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోయిన ఏబీపీ న్యూస్‌ ప్రతినిధులు ఆరా తీశారు.

modi 07082018 3

అసలు విషయం కనుక్కొని జూలై 6న మాస్టర్‌ స్ట్రోక్‌ లో ఒక కథనం ప్రసారం చేశారు. తమ గ్రామానికి వచ్చిన అధికారి ఒకరు రెట్టింపు ఆదాయం అంటూ అబద్ధం చెప్పడానికి శిక్షణ ఇచ్చారని ఆమె అంగీకరించింది. దీంతో బీజేపీ నాయకులు గగ్గోలు పెట్టారు. మహిళా రైతు వ్యాఖ్యలను ఏబీపీ చానెల్‌ వక్రీకరించిందని బీజేపీ మంత్రులు ఆరోపించారు. దాంతో ఏబీపీ చానెల్‌ మహిళ ఉండే గ్రామానికి విలేకరిని పంపి ఆమె ఆర్థిక పరిస్థితిపై స్థానికులతో మాట్లాడించింది. దీని పైనా బీజేపీ పెద్దలు అగ్రహోదగ్రులయ్యారు. ఈ నేపథ్యంలో ‘మాస్టర్‌ స్ట్రోక్‌’ యాంకర్‌ మారిపోయారు. మర్నాటి నుంచి పుణ్య ప్రసూన్‌ బాజ్‌పాయ్‌ బదులు చిత్ర త్రిపాఠీ యాంకరింగ్‌ చేస్తారని యాజమాన్యం ప్రకటించింది.

modi 07082018 4

తాజాగా బాజ్‌పాయ్‌ ఉద్యోగమే పోయింది. మరో యాంకర్‌ అభిసార్‌ శర్మను కూడా ఇక నుంచి మేకప్‌ వేసుకోవద్దని చెప్పారట. వార్తల్లో ఎక్కడా మోదీ సర్కారుపై విమర్శలు రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశాలు ఇవ్వగా, అభిసార్‌ వాటిని ప్రశ్నించాడు. ఉత్తరప్రదేశ్‌లో నేరాలు తగ్గాయని ఇటీవల మోదీ ప్రకటించిన మర్నాడే రెండు దారుణ హత్యలు జరిగాయి. అభిసార్‌, మోదీ ప్రకటనను ప్రస్తావిస్తూ యూపీలో శాంతి భద్రతలపై కథనాన్ని ప్రసారం చేశారు. మధ్యలోనే చానల్‌ సీఈవో వచ్చి ప్రసారాలు నిలిపివేయాలని మిళింద్‌ను ఆదేశించారు. అప్పటికే బులెటిన్‌ మొదలై 5 నిమిషాలు కావడంతో నిలిపివేసే పరిస్థితి లేదని మిళింద్‌ చెప్పారు. దీంతో అప్పటికప్పుడు మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి కథనాలు రాయొద్దని అందరికీ లిఖితపూర్వక ఆదేశాలు వెళ్లాయి. అభిసార్‌కు 15 రోజుల్లో రాజీనామా చేయాలని చెప్పారు. తర్వాత మిళింద్‌పై వేటు పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read