ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఒక ముఖ్య అధికారిని విచారణకు పిలిపించాలని, తన పై శాఖాపరమైన విచారణ చేపట్టిన కమీషనర్ అఫ్ ఎంక్వైరీస్ కు, ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. సచివాలయంలో కమీషనర్ అఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియా చేపట్టిన తోలి రోజు విచారణకు హాజరయిన ఏబి వెంకటేశ్వరరావు వివిధా ఆధారాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఒక ముఖ్య అధికారితో పాటుగా, ఏసిబిలోని సిఐయి విభాగం డిప్యూటీ డైరెక్టర్ సాయి కృష్ణ, సిఐడి డీఎస్పీ విజయ్ పాల్ ను కూడా విచారణకు పిలిపించాలని కోరారు. నిఘా పరికరాల కొనుగోళ్లకు సంబంధించి, ఒప్పందాలు, ప్రభుత్వ ఆదేశాలు, కేంద్ర హోం శాఖ, డీజీపీ, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, డిఐజి సహా, వేరు వేరు విభాగాలు ఇచ్చిన నివేదికలు, లేఖల కూడా, ఏబి వెంకటేశ్వరరావు సమర్పించారు. తనను సస్పెండ్ చేయటానికి నెల రోజులు ముందుగానే వేతనం నిలిపివేసారని, కుట్ర పూరితంగా తనను తప్పుడు కేసులో ఇరికించే నిర్ణయం తీసుకునే ముందే, ఈ వ్యవహారం జరిగిందని, ఏబివి చెప్పారు. తనకు జీతం నిలిపివేస్తూ, చీఫ్ సెక్రటరీ కార్యాలయం, డీజీపీ కార్యాలయం మధ్య నడిచిన ఫైల్స్ తెప్పించాలని, తన తరుపున వాదనలకు, ఈ ఫైల్స్ తనకు కీలకం అవుతాయని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
తన వాదనలు మొత్తం, ఏబీ వెంకటేశ్వర రావు, రాత పూర్వకంగా నాలుగు లేఖలో రూపంలో విచారణా అధికారి ముందు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం వివరాలు అన్నీ, ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆరోపణలు తిప్పి కొడుతూ, పలు ఆధారాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అలాగే కొన్ని డాక్యుమెంట్ లు కూడా, తెప్పించాలని ఆయన వ్యూహాత్మకంగా కోరటంతో, ప్రభుత్వం ఇచ్చే ఆ ఫైల్స్ తోనే, వారికి సమాధానం చెప్పాలని, ఆయన ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ విచారణ ఈ రోజు, రేపు కూడా నడిచే అవకాసం ఉంది. ఇక మరో పక్క, ఈ విచారణ తొందరగా చేసి, తమ ముందు ఉంచాలి అంటూ కోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఆదేశాలు ప్రకారం, వెంటనే విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే నిఘా పరికరాల కొనుగోళ్ళు జరగలేదని, అసలు ఎక్కడా ఏమి జరగని చోట, కుంభకోణం జరిగింది అంటూ, ఆరోపిస్తున్నారు అంటూ, ఏబీ వాదిస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, గత రెండేళ్లుగా ఇలా చేస్తున్నారని వాపోయారు.a