ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, డీజీ ర్యాంక్ ఉన్న ఏబీ వెంకటేశ్వర రావు ఐపిఎస్ పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తీవ్రమైన ఆరోపణలు చేసి, సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తనకు జరిగిన అన్యాయం పై కోర్టుకు వెళ్లారు. రెండేళ్ళ నుంచి ఈ కేసు సాగదీయటం పై, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచారణ తొందరగా ముగించమని, డెడ్లైన్ విధించింది. దీంతో విధిలేని పరిస్థితిలో, ఏబీ వెంకటేశ్వర రావు పై విచారణ జరపాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు, ఆయన విచారణకు రావాలని ఆదేశించారు. అయితే ఏబీ వెంకటేశ్వర రావు విచారణకు హాజరు అయిన తరువాత, ఆయన పన్నిన వ్యూహంలో ప్రభుత్వం చిక్కుక్కుంది. తన పైన దేశ ద్రోహం ఆరోపణలు చేసిన వారు, నిరూపించాలంటూ,ఆయన భీష్మించుకుని కూర్చుకున్నారు. ముఖ్యంగా తనని సస్పెండ్ చేస్తూ, ప్రెస్ కి వివరాలు ఇచ్చే సమయంలో, తన పై ఏనక ఆరోపణలు చేసిన సీపీఆర్వో శ్రీహరిని ఆయన టార్గెట్ చేసారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు, విచారణకు వచ్చిన ఏబి వెంకటేశ్వర రావు, ముందుగా సీపీఆర్వో శ్రీహరిని కూడా ఈ విచారణకు పిలిపించాలని కోరారు. ఆయన తన పై అనేక ఆరోపణలు చేసారని, చివరకు దేశ ద్రోహం ఆరోపణలు కూడా చేసారని అన్నారు.
ఆ ఆరోపణలపై వాస్తవాలు ఏమిటో, ఆయన్ను పిలిచి విచారణ చేయాలని కోరారు. దీంతో, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సిసోడియా, చేసేది లేక, సీపీఆర్వో శ్రీహరిని విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చారు. అయితే తాను విచారణకు రాలేను అంటూ, ఆయన బదులు ఇచ్చారు. దీంతో అసలు ఈ ఆరోపణలు తన పై ఎందుకు చేసారు, ఎవరు చెప్తే చేసారు అంటే అంశం పై, అడగాలి అనుకున్న ఏబివికి, అవకాసం లేకుండా పోయింది. అయితే తాను పై నుంచి వచ్చే నోట్, మీడియాకు వదలుతాను కాని, తనకు ఈ విషయం పై వివరాలు ఏమి తెలియదు అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక మరో పక్క, నాలుగో తారిఖు మళ్ళీ విచారణకు ఏబీవీ రానున్నారు. ఈ సమయంలో, సహజంగా, ఇలాంటి విచారణల్లో, రాత పూర్వకంగా సమాధానాలు చెప్తారు. అయితే ఏబీవీ మాత్రం, నేరుగా తనను ప్రశ్నలు అడగవచ్చని, ఎవరికి అనుమానం ఉన్నా, ఏ విషయం పైన అయినా, తాను నేరుగా సమాధానం చెప్తానని, చెప్పినట్టు తెలుస్తుంది. సహజంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు, నేరుగా ప్రశ్నలు అడిగేందుకు కాకుండా, న్యాయ సలహా తీసుకుని రత పూర్వకంగా సమాధానాలు ఇస్తారని, అయితే ఏబీవీ మాత్రం, ధైర్యంగా విచారణకు సై అనటం, గమనించాల్సిన అంశం.