ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా చేస్తున్న పనులు అందరికీ అర్ధం అవుతున్నాయి. ముఖ్యంగా తమకు ప్రత్యర్ధి అనుకున్న వారిని, వింత వింతగా టార్గెట్ చేస్తున్నారు. వీకెండ్ వస్తుంది అంటే ఎవరికో ఒకరికి మూడుతుంది అనే అర్ధం. ఏదైనా కూల్చాలి అంటే శనివారం వెళ్లి కూల్చేస్తున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేయాలి అంటే శనివారం వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కోర్టులు ఉండవు. కోర్టుకు వెళ్ళే అవకాసం లేకపోవటంతో, ఈ లోపు తమ ప్రత్యర్ధి పై తమకున్న మీడియాతో బురద జల్లేయవచ్చు. చివరకు తాము చేసిన ఆరోపణలు, ఆరోపణలుగానే ఉండి పోతాయి. ప్రజల్లో మాత్రం తాము వెళ్ళాలని అనుకున్నది వెళ్ళిపోతుంది. అచ్చెన్న విషయమే తీసుకుంటే, ఆయన 800 కోట్లు స్కాం చేసారని నమ్మించి, చివరకు రూపాయి కూడా రుజువు చేయలేక పోయారు. రాజకీయ నాయకులు కాబట్టి, వాలు అరెస్ట్ అయినా ఎవరికీ ఏమి పట్టదు. అయితే ఇదే పని ఐఏఎస్, ఐపీఎస్ లకు చేస్తే, వారు సస్పెండ్ అయిపోతారు. రూల్స్ ప్రకారం, 48 గంటలు కస్టడీలో ఉంటే, వాళ్ళు ఆటోమేటిక్ గా సస్పెండ్ అయిపోతారు. ఎప్పటికో ఇక వారుకు వారు ప్రూవ్ చేసుకోవాలి. అయితే తన పై ప్రభుత్వం ఇలాంటి కుట్ర పన్నింది అంటూ, ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, హైకోర్టుకు వెళ్ళారు.

abv 07012021 2

తనను ప్రభుత్వం శనివారం రోజున అరెస్ట్ చేసి, రెండు రోజులు కస్టడీలో ఉంచి, సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉందని హైకోర్టుకు తెలిపారు. గతంలో తన పై ఇలాగే రాత్రికి రాత్రి సస్పెండ్ చేసి, మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అదే అధికారిక సమాచారంలా మీడియాలో తనను అప్రతిష్టపాలు చేసారని, చివరకు పది నెలలు తరువాత, చార్జెస్ లో , అప్పుడు తన పై ప్రచారం చేసిన ఏవీ పెట్టలేదని అన్నారు. ఇలాగే ఇప్పుడు తనని వీకెండ్ లో అరెస్ట్ చేసి, సోమవారం కోర్టుకు వెళ్ళే దాకా, అంటే 48 గంటలు ఉంచగలిగితే, తనను సస్పెండ్ చేయాలని చూస్తున్నారని, అందుకే తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోరారు. దీని పై అటు ప్రభుత్వం, ఇటు ఏబీవీ తరుపు వాదనలు విన్న హైకోర్టు, రెండు వారాల పాటు పోలీసులు తొందరపడవద్దు అని, దీని పై ప్రభుత్వం రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలనీ చెప్తూ, ఈ కేసుని ఈ నెల 18కి వాయిదా వేసింది. తద్వారా ప్రభుత్వం పన్నిన ఎత్తుగడను పసిగట్టిన ఏబీవీ, ప్రభుత్వం పై ఇప్పటికి పై చేయి సాధించారు. ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్తుందా, లేక ఏ దారిలో వస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read