ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనని అకారణంగా వేధిస్తుంది అంటూ, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‍కు సంచలన లేఖ రాసారు. తన పై క్రిమినల్ కేసు పెట్టి, అరెస్ట్ చేసి, మళ్ళీ జ్యూడిషియల్ రిమాండ్‍కు పంపించి, మళ్ళీ సస్పెండ్ చేసే ప్లాన్ వేసారని, ఏబీవీ తెలిపారు. తన దగ్గర దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇది లేఖ సారాంశం "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా పై కక్ష సాధింపుకు పాల్పడుతుంది. ఏపిలో కొత్త ప్రభుత్వం వచ్చిన రోజే నన్ను ఏసిబీ డీజీ పోస్ట్ నుంచి తప్పించి, జీఏడీలో రిపోర్ట్ అవ్వమన్నారు. కొన్ని నెలలుగా నాకు జీతం కూడా ఇవ్వకపోయినా, నేను ఓర్పుగా ఉండి, చివరకు వారికి లేఖ రాయాల్సి వచ్చింది. రెండు సార్లు ఈ విషయం పై, తన పోస్టింగ్ విషయం పై లేఖ రాసాను. నన్ను పక్కన పెట్టి, జీతం కూడా ఇవ్వని సమయంలో, నా పై ఎలాంటి కేసు కూడా లేదు. నా 30 ఏళ్ళ సర్వీస్ లో ఎప్పుడూ నా పై ఒక్క ఆరోపణ కూడా రాలేదు. అయితే నా లేఖల పై ఎలాంటి వివరణ ఇవ్వక పోగా, నా పై ఆరోపణలు మోపారు. నా పై ఏవో ఎంక్వయిరీ అంటూ, చివరకు ఫిబ్రవరి 2020లో నన్ను సస్పెండ్ చేసారు. నన్ను సస్పెండ్ చేయటమే కాకుండా, నా పై కావాలని మీడియాలో వ్యతిరేకంగా ఒక పెద్ద క్యాంపైన్ నడిపారు.

abv 05012021 2

"క్యాట్ కు వెళ్ళాను, తరువాత హైకోర్టుకు వెళ్ళాను. చివరకు హైకోర్టులో నా సస్పెన్షన్ ఎత్తేసి, జీతాలు ఇవ్వమని ఆదేశించారు. అయితే హైకోర్టు ఆర్డర్ ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆరు నెలల తరువాత సుప్రీం కోర్టుకు వెళ్ళారు. అయితే ఈ న్యాయ పోరాటాల కోసం, నా పర్సనల్ సేవింగ్స్ నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. నా సస్పెన్షన్ అయిన పది నెలలు తరువాత చార్జెస్ మోపారు. అయితే దీని పై నేను తప్పు చేయలేదని నిరూపించుకునే క్రమంలోనే, నా పై మరో కుట్ర పన్నుతున్నారని సమాచారం ఉంది. నా పై క్రిమినల్ కేసు పెట్టి జ్యూడిషియల్ రిమాండ్‍కు పంపి మళ్లీ సస్పెన్షన్ విధించే అవకాశం ఉంది. బెయిల్ కూడా తీసుకోకుండా, కుట్ర పన్నుతున్నారు. ఇవన్నీ నేను ఆన్ రికార్డు చెప్తున్నాను. దీని పై నా దగ్గర సమగ్ర సమాచారం ఉంది. అసోసియేషన్ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని ఆధారాలు మీ ముందు ఉంచుతాను. మీ నుంచి నేను ఏ ఫేవర్ కోరటం లేదు కానీ, మీ దృష్టికి ఈ విషయం తీసుకుని వస్తున్నాను. ప్రభుత్వం నన్ను ఎలా వేదిస్తుందో చెప్తున్నాను." అని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read