ఇటీవల సస్పెన్షన్‌ను గురైన ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు న్యాయం చేయాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఏబీ వెంకటేశ్వరరావు తరపున సీని యర్ న్యాయవాది వై బాలాజీ వాదనలు వినిపిస్తున్నారు. ప్రతి వాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని, డీజీపీని, కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన జీవో 18 చట్టవిరుద్ధ మని, ఏకపక్షమని, పక్షపాతంతో , నిబంధనలు ఉల్లంఘించి జీవో ఇచ్చారని, దానిని రద్దు చేసి తనపై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను తొలగించాలని ఏబీ వెంకటేశ్వరరావు క్యాలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది మార్చి 10వ తేదీన తనను అదనపు డైరెక్టర్ జనరల్ హోదా నుండి డైరెక్టర్ జన రల్ ఆఫ్ పోలీసు హోదాకు పదోన్నతి కల్పించారని, అనం తరం 2018 ఏప్రిల్ 20న ఏసీబీ డీజీగా తనను నియమించా రని, తదనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో 2019 మే 31న రిలీవ్ చేసి సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారని, ఆనాటి నుండి తనకు పోస్టింగ్ ఇవ్వ లేదని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
గత ఏడాది మే 31 నుండి వేతనం చెల్లించడం లేదని, నిరాధార ఆరోపణలతో సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయ ఒతిళ్లతోనే తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టులో తాను ఉండటాన్ని సహించలేకపోయారని పేర్కొన్నారు. భద్రతా ఉపకరణాల కొనుగోలుకు కమిటీ ఉంటుందని, అనంతరం ఆడిటింగ్ జరు గుతుందని అవన్నీ అయ్యాకనే డీజీ స్థాయి అధికారి వద్దకు సాధారణ సంతకం కోసం ఫైలు వస్తుందని పిటిషన్లో పేర్కొ న్నారు. ప్రజాప్రయోజనాల రీత్యా సస్పెండ్ చేసినట్లు పేర్కొ న్నారని ఇది సరికాదని చెప్పారు. 30 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ ఎలాంటి ఆరోపణలను తాను ఎదుర్కోలేదని, 2006లో ఇండి యన్ పోలీసు మెడల్, 2015లో ప్రెసిడెంట్ పోలీసు మెడల్ వచ్చిందని 2019లో అతి ఉత్కృష్ట సేవా పతకం కూడా దక్కిం దని పేర్కొన్నారు.
సెలవుపూట తన సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చా రని, దానికంటే ముందు ఎలాంటి దర్యాప్తు లేదా విచారణ తనపై జరగలేదని, ఇండియన్ పోలీసు సర్వీసు రూల్ను పాటించలేదని , 48 గంటల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉన్నా అలాంటిది ఏమీ జరగలేదని పేర్కొన్నారు. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే సస్పెండ్ చేయడం సరికాదని వెంకటేశ్వరరావు తన పిటిషన్లో పేర్కొ న్నారు. సస్పెన్షన్ జీవోను బహిర్గతం చేయడంతో అది అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చిందని, దాంతో తాను అనివా ర్యంగా ప్రకటన జారీ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ పిటీషన్ పై ఈ రోజు క్యాట్ విచారణ జరిపింది. ఏబీ వెంకటేశ్వర్ రావ్ క్యాట్ లో వేసిన పిటిషన్ 24 వ తేదీ కి వాయిదా వేసింది క్యాట్. ఏపీ ప్రభుత్వం తరపున దేశాయి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. డీజీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేసారు, డీజీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే హోమ్ శాఖ కి ఇన్ఫార్మ్ చేశారా, ఐపీఎస్ అధికారికి మే 31 2019 నుంచి ఎందుకు జీతం ఇవ్వలేదు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. దీని పై, వారం రోజుల సమయం ప్రభుత్వం అడగగా, విచారణ ఈ నెల 24 కి వాయిదా వేసింది క్యాట్.