మరి కొద్ది సేపట్లో సీనియర్ ఐపిఏ అధికారి, ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. గత కొద్ది రోజులు నుంచి చంద్రబాబు ప్రభుత్వం పెగాసిస్ కొనుగోలు చేసారని, ఏబీ వెంకటేశ్వరరావు, అలాగే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ పెగాసిస్ సాఫ్ట్ వేర్ ని ఏబీ వెంకటేశ్వరరావు హయాంలో కొనుగోలు చేసారని, ఆయన ఇంటలిజెన్స్ చేఇఫ్ గా ఉన్న సమయంలోనే, ఈ పెగాసిస్ సాఫ్ట్ వేర్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు అంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఈ సాఫ్ట్వేర్ తీసుకుని, అప్పట్లో వైసీపీ కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసారని కూడా అప్పట్లో వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు ఈ రోజు వైసీపీ ఈ ఫేక్ ప్రచారాన్ని బయట చేసింది అంటే అర్ధం చేసుకోవచ్చు, ఏకంగా ఫేక్ ప్రచారాన్ని అసెంబ్లీ వరకు తీసుకుని వచ్చింది. ఈ రోజు అసెంబ్లీ మొదలు కాగానే, ఈ అంశం పైన బుగ్గన రాజేంద్రనద్ రెడ్డి, పెగాసిస్ అంశం పైన సభలో చర్చించాలని, స్పీకర్ ని కోరారు. అలాగే ఇదే అంశం పై చీఫ్ విప్ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపధ్యంలో, కేవాలం ఒక గాలి వార్తా ఆధారం చేసుకుని, ఈ అంశం పై ఈ రోజు అసెంబ్లీలో చర్చించనున్నారు.

abv 21032022 2

ఈ నేపధ్యంలో ఏబి వెంకటేశ్వరరావు, ఈ అంశం పైన, వాస్తవాలు బయట పెట్టి, ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక ఆర్టిసి సమాధానంలో, ఈ ప్రభుత్వమే వివరణ ఇచ్చింది. అప్పటి డీజీపీ గౌతం సవాంగ్, మా పోలీస్ డిపార్టుమెంటు, ఇలాంటి సాఫ్ట్ వేర్ ఏమి కొనలేదని, అని స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అయినా కూడా, వైసీపీ తమ ప్రభుత్వంలోనే ఈ సమాధానం వచ్చినా, ఫేక్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండటం, ఏబి వెంకటేశ్వరరావుని టార్గెట్ చేయటంతో, ఆయన వివరణ ఇవ్వనున్నారు. అంతే కాకుండా, ఆయన వివరణ ఇవ్వటమే కాకుండా, తన పై ఆరోపణలు చేసిన వారి పైన, పరువు నష్టం దావా వేయటానికి కూడా ఏబి వెంకటేశ్వరరావు రెడీ అయ్యారు. దీని కోసం ఆయన చీఫ్ సెక్రెటరి అనుమతి కూడా కోరారు. ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు సచివాలయం వచ్చే అవకాసం ఉంది. మొత్తానికి, తన పై ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ ఫేక్ బ్యాచ్ మొత్తానికి, దబిడి దిబిడి వాయించేందుకు ఆయన సిద్ధం అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read