మాజీ మంత్రి వివేక కేసుకు సంబంధించి, సిబిఐకి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది. ఈ లేఖలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ సంచలన విషయాలు పేర్కొన్నారు. అందులో ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే, వివేక హ-త్య కు సంబంధించి, అనేక వివరాలు తన వద్ద ఉన్నాయని, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న సింగ్ కు ఫోన్ చేసి, రెండు మూడు సార్లు ఈ విషయం పై, చెప్పినప్పటికీ కూడా ఆయన స్పందించలేదని చెప్పారు. సిబిఐ అధికారులను తన వద్దకు పంపుతానని చెప్తారని, అయితే ఇప్పటి వరకు పంపలేదని, ఆయన తెలిపారు. ఈ విషయాలు అన్నీ సిబిఐ డైరెక్టర్ కు రాసిన లేఖలో తెలిపారు. అయితే ఇప్పుడు ఈ లేఖ రాయటం సంచలనం సృష్టిస్తుంది. ఈ లేఖ ఉగాది నాడే సిబిఐకి రాసినా, ఇప్పుడు ఈ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో చాలా స్పష్టంగా, వివేక హ-త్య ఘటన చోటు చేసుకున్నప్పటి పరిణామాలు అన్నీ కూడా, ఆయన ఈ లేఖలో వివరించారు. సిబిఐ విచారణ మొదలై ఏడాది గడుస్తున్నా కూడా, కేసు విచారణలో ఏ మాత్రం ముందడుగు లేదు అనే విషయాన్ని కూడా ఏబీ వెంకటేశ్వరరావు, సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసోకోచ్చారు. ఈ మ-ర్డ-ర్ కు సంబంధించి, సిబిఐకి అందించాల్సిన సమాచారం తన వద్ద ఉందని, రెండు సార్లు పైగా ఫోన్ చేసి చెప్పినా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి ఏ మాత్రం స్పందన లేదు అని చెప్పారు.
ఏ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి, ఆ అధికారితో మాట్లాడింది కూడా, ఆయన తన లేఖలో తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో, ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ విభాగానికి చీఫ్ గా ఉన్నారు. అయితే డీజీపీ స్థాయి అధికారి సమాచారం ఇస్తాను అంటున్నా కూడా సిబిఐ పట్టించుకోక పోవటంతో, సర్వత్రా విస్మయాన్ని గురి చేస్తుంది. హ-త్య జరిగితే ఒక ఎంపీ, దీన్ని గుండె పోటుగా ప్రచారం చేసారని ఏబీ వెంకటేశ్వరరావు ఆ లేఖలో స్పష్టంగా తెలిపారు. ఈ కోణంలో ఎందుకు విచారణ చేయటం లేదు అనేది కూడా ప్రశ్నగా మారింది. మరో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన బంధువులు, ఇల్లు అంతా కడిగి, ర-క్తం లేకుండా చేసి, ఆధారాలు చెరిపేసి, శవానికి కుట్లు వేసి, మొత్తం దగ్గర ఉండి చూసుకున్నారని కూడా, ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేసారు. వారు ఘటనా స్థలాన్ని మొత్తం అదుపులో ఉంచుకున్నారని, ఆ సమయంలో మీడియాని కానీ, ఇంటలిజెన్స్ సిబ్బందిని కానీ, లోపలకు రానివ్వలేదని చెప్పారు. అయితే ఆధారాలు ఉన్నాయని ఒక డీజీపీ స్థాయి అధికారి చెప్తున్నా, సిబిఐ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్ధం కావటం లేదు...