చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇది చంద్రాబాబు మార్క్ పాలన కాదు అని చాలా మందికి అసంతృప్తి ఉండేది... చంద్రబాబు కూడా ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చారు... ప్రభుత్వ అధికారులకి ఏమి కావలి అంటే ఇది ఇస్తున్నారు... భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదు... చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఉద్యోగులు లెక్క చేయలేదు...
దీంతో చంద్రబాబు దీని మీద ఫోకస్ చేశారు... ఎలా అయినా ఈ లంచాల అవినీతిని అరికట్టటానికి ప్రణాలికలు సిద్ధం చేశారు... దాదాపు యుద్ధం ప్రకటించారు.. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ చీఫ్‌గా నియమించారు. దీంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఏసీబీ అధికారులను ఉరుకులు పెట్టించారు.
అమరావతి సచివాలయంలోని హోంశాఖ నుంచే అవినీతిపరులపై దాడులు మొదలు పెట్టారు. ప్రతిరోజూ రెండు, మూడు ట్రాప్‌లు... వారానికి ఒకటి, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల పోగేసిన వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎంతటి వారి పైన అయినా దాడులు ప్రారంభించాలని, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏసీబీకి ఈ మాటలు, మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
లంచాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం కాదు, ఇన్నాళ్ళు ప్రజలను పీల్చి పిప్పి చేసిన వారి అంతం కూడా చూడామని చంద్రబాబు ఏసీబీ చీఫ్ కు స్పష్టం చేశారు. దీని ఎఫెక్ట్, ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ చీఫ్ పాండురంగారావు మీద ఏసీబీ దాడి, 700 కోట్ల ఆస్తి గుర్తింపు... తాజాగా ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘు, 500 కోట్ల ఆస్తి గుర్తింపు...
20 వేలు సంపాదించుకుని, నెల గడవటానికి మనం ఇంతలా కష్టపడుతుంటే, ఈ అధికారులు మనల్నే పీల్చి పిప్పి చేసి, వేల కోట్ల ఆస్తులు వెనకేసుకుంటున్నారు... మొత్తానికి, వీళ్ళ పాపం పండినట్టే అనుకోవాలి...ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై ముప్పేట దాడి ప్రారంభమైంది. అది పతాక స్థాయికి చేరింది... తెగ బలిసిన పంది కొక్కులు బయట పడుతున్నారు...
ఏసీబీ దూకుడు, ప్రభుత్వ కాల్ సెంటర్ 1100, లంచాల సొమ్ము బాధితులకు వెనక్కి ఇవ్వడం... ఇప్పుడు ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది... అవినీతిపై జరుగుతున్న పోరాటంపై ప్రజలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాలు అందించాలి అని కోరుకుందాం...