చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇది చంద్రాబాబు మార్క్ పాలన కాదు అని చాలా మందికి అసంతృప్తి ఉండేది... చంద్రబాబు కూడా ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చారు... ప్రభుత్వ అధికారులకి ఏమి కావలి అంటే ఇది ఇస్తున్నారు... భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదు... చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఉద్యోగులు లెక్క చేయలేదు... దీంతో చంద్రబాబు దీని మీద ఫోకస్ చేశారు... ఎలా అయినా ఈ లంచాల అవినీతిని అరికట్టటానికి ప్రణాలికలు సిద్ధం చేశారు... దాదాపు యుద్ధం ప్రకటించారు.. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ చీఫ్‌గా నియమించారు. దీంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఏసీబీ అధికారులను ఉరుకులు పెట్టించారు.
అమరావతి సచివాలయంలోని హోంశాఖ నుంచే అవినీతిపరులపై దాడులు మొదలు పెట్టారు. ప్రతిరోజూ రెండు, మూడు ట్రాప్‌లు... వారానికి ఒకటి, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల పోగేసిన వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎంతటి వారి పైన అయినా దాడులు ప్రారంభించాలని, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏసీబీకి ఈ మాటలు, మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. లంచాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం కాదు, ఇన్నాళ్ళు ప్రజలను పీల్చి పిప్పి చేసిన వారి అంతం కూడా చూడామని చంద్రబాబు ఏసీబీ చీఫ్ కు స్పష్టం చేశారు. దీని ఎఫెక్ట్, ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ చీఫ్ పాండురంగారావు మీద ఏసీబీ దాడి దగ్గర నుంచి, పెద్ద తలయకాయలు దొరుకుతూనే ఉన్నారు.
ఇప్పుడు ఈ పట్టుకున్న వారి అంతు చూసే పనిలో ఉంది ప్రభుత్వం. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ చరిత్రలో మొదటిసారి ఒక కేసు దర్యాప్తును ఆరు నెలల్లో ముగించి ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులోభాగంగానే ప్రత్యేక న్యాయస్థానాల చట్టం-2016 ప్రకారం విజయనగరం జిల్లాకు చెందిన సర్వే ఇన్స్పెక్టర్ గేదెల లక్ష్మీగణేశ్వరరావుకు చెందిన రూ.8 కోట్ల (మార్కెట్ విలువ రూ.100 కోట్లకుపైగా) విలువైన ఆస్తులను జప్తు చేయనున్నామని రాష్ట్ర అనిశా డీజీ ఆర్.పి.ఠాకూర్ వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డ అధికారులకు సంబంధించిన స్థిరాస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటుందని, కేసులు తేలే వరకు అవన్నీ ప్రభుత్వం నిర్వహణలోనే ఉంటాయని వివరించారు. వాటిని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వినియోగించుకుంటుందని తెలిపారు. అవినీతి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఇతర కోర్టులకు వెళ్లే అధికారం కూడా ఉండదన్నారు. ఆయా ఆస్తుల నిర్వహణ లాభదాయకం కాకపోతే వాటిని విక్రయించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. దేశంలో బిహార్, ఒడిశాల్లో మాత్రమే ఇలాంటి కఠిన చట్టాలున్నాయని తెలిపారు.