ఉత్తరాంధ్రలో మళ్ళీ అలజడి రేగింది. గత నెలలో చంద్రబాబు రామతీర్ధం వెళ్తున్నారు అనగానే, గంట ముందు అక్కడకు వచ్చిన విజయసాయి రెడ్డి, అక్కడ అలజడికి కారణం అయ్యారు. చివరకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావ్ లాంటి నేతల పై కేసులు పెట్టారు అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి శ్రీకాకుళం జిల్లా, నిమ్మడ వెళ్తున్నారు. విజయసాయి రెడ్డి నిమ్మడ వచ్చే గంట ముందు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్ష్యుడిని అరెస్ట్ చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈ అరెస్ట్ ని ఖండించారు. అయితే అచ్చెన్నాయుడు అరెస్ట్ కు సంబంధించి, పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్టు తెలుస్తుంది. వైసిపీ సర్పంచ్ అభ్యర్ధి అప్పన్నను, ఆ పార్టీ నియోజికవర్గ ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ను చంపబోయారని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. మరొక ఎఫ్ఐఆర్ రిటర్నింగ్ అధికారిని విధి నిర్వహణలో బెదిరించారని. అయితే రెండో ఎఫ్ఐఆర్ లో అచ్చెన్నాయుడు పేరు ఉందో లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ కేసులో ఎక్కడా అచ్చెన్నాయుడు, బెదిరించినట్టు లేదు. వైసిపీ బయట పెట్టిన ఫోన్ సంభాషణలో కూడా ఏమి లేదు. అందులో కూడా అచ్చెన్నాయుడు, తన బంధువు అప్పన్నతో, మనలో మనకు ఎందుకు, ఒకసారి ఆలోచించుకో, బలవంతం ఏమి లేదు అని చెప్తున్నట్టు ఉంది.
అయితే ఇందులో ఎక్కడ బెదిరింపు ఉంది అంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక మరో విషయం కూడా టిడిపి అనుమానం వ్యక్తం చేస్తుంది. రామతీర్ధం ఘటనలో కూడా అచ్చెన్నను అరెస్ట్ చేస్తారని టిడిపి అనుమానిస్తుంది. ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ గొ-డ్డ-ళ్లు, క-త్తు-లు పెట్టుకుని దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక జీపుపై కూర్చుని సినిమాల్లో విలన్ లాగ వినడానికి వీలు లేనటి వంటి బూతులు మాట్లాడారని టిడిపి మండి పడింది. అచ్చెన్నాయుడునే కాకుండా ఆయన తల్లిని కూడ దుర్బాషలాడడం ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ అని, దువ్వాడ మీద 307 సెక్షన్ కింద నాన్ బెయిల బుల్ కేసు పెట్టకుండా, అచ్చెన్నాయుడు పై పెట్టటం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. అచ్చెన్నాయుడుపై తప్పులు కేసులు పెట్టి టీడీపీ బలపరిచిన వారు నామినేషన్లు వెనక్కు తీసుకునేలా భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కుట్రలో భాగంగా అచ్చెన్న ఇంటి మీదకు వెళ్లి భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలపై దా-డి-కి వెళ్లిన వారిపై కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. వైసీపీ తీరు వల్ల శాంతి భద్రతలకు అగాధం ఏర్పడి ఎన్నికలు సజావుగా సాగవని, దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రమంతా ఇలాగే ప్రవర్తిస్తారన్నారు.