తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. లోకేష్ , చంద్రబాబు రోడ్ షోలు, మీటింగ్ ల తో, మంచి ఊపు వచ్చింది. మరో పక్క వైసీపీ ప్రచారం రొటీన్ అయిపొయింది. కొడాలి నాని బూతులు, అనిల్ యాదవ్ అరుపులు, పెద్దిరెడ్డి శాపనార్ధాలు తప్ప, వైసీపీకి ఊపు తెచ్చేలా వారి ప్రచారం సాగటం లేదు. కేవలం చివరి రెండు రోజులు, చెయ్యాల్సిన వాటి పైనే ఫోకస్ పెట్టారు. అయితే ఇంటలిజెన్స్ రిపోర్ట్ లు ద్వారా విషయం అర్ధమైన జగన్ మోహన్ రెడ్డి, తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే లోకేష్, వివేక కేసు పై ప్రమాణం చేయాలి అని చెప్పటంతో , ఆ విషయం హైలైట్ అయ్యింది. దీంతో, తిరుపతి వస్తే, ఆ కేసు పై స్పందించాల్సిన పరిస్థితి జగన్ కు రావటంతో, జగన్ వెనకడుగు వేసారు. క-రో-నా కారణంతో తప్పించుకున్నారు. మరో పక్క వివేక కేసు, ఒక పక్క టిడిపి దూకుడుతో, ఉక్కిరిబిక్కిరి అయిన వైసీపీకి, ఒక తలతిక్క వీడియో దొరికింది. ఆ వీడియోను కొన్ని మార్పులు చేర్పులు చేసి, బులుగు మీడియాలోకి, పేటీయం కూలీల తోటి సోషల్ మీడియాలోకి వదిలారు. నిన్న ఉగాది పండగ కూడా చేసుకోకుండా, ఆ వీడియోని తిప్పటం పైనే, వైసీపీ క్యాడర్ మొత్తం పని చేసింది. ఆ వీడియోలో అచ్చేన్నాయుడు, లోకేష్ ని తిడుతున్నాడు అంటూ సృష్టించారు.

blue 14042021 2

అచ్చేన్నాయుడు టిడిపి పార్టీని తిడుతున్నాట్టు చేపించారు. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి, ఏదో సెటిల్మెంట్ విషయంలో, తనకు చంద్రబాబు, లోకేష్ అండగా లేరు అంటూ వాపోతున్నాడు. అసలు చంద్రబాబు, లోకేష్ , ఎందుకు సెటిల్మెంట్ లు చేస్తారు ? ఇవేమీ పట్టించుకోకుండా, తెలుగుదేశం శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బ తీయాలని, అచ్చేన్నాయుడు పై అనుమానాలు రేకెత్తించే విధంగా చేయాలని ప్లాన్ చేసారు. అయితే వారి ఆశలు, పాపం 24 గంటలు కూడా నిలువలేదు. అచ్చేన్నాయుడు, లోకేష్ ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. ఒకరి పై ఒకరు చేతులు వేసి, ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ చర్యతో, తాము అంతా ఒక్కటే అని, బీసీ నాయకత్వానికి, లోకేష్, టిడిపి ఎంత గౌరవం ఇస్తుందో చెప్పకనే చెప్పారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా, తమను ఏమి చేయలేరు అనే సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ ని ఇలా చూసినా బులుగు మీడియా, నిన్న అంత కాష్ట పడి చేసిన ఎడిటింగ్ లు అన్నీ, బూడిదలో పోసిన పన్నీరు కావటంతో, పాపం వారి రియాక్షన్ ఇప్పుడు ఏమిటో అంటూ టిడిపి నేతలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read