తెలుగుదేశం పార్టీ సంస్థగాత నిర్మాణంపై మహానాడులో చర్చ సందర్భంగా.. జిల్లా స్థాయి కమిటీలు. శాఖలు, అనుబంధ సంఘాలకు బదులుగా.. పార్లమెంటు స్థాయి కమిటీలు, శాఖలు, అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లా స్థాయి కమిటీల వలన ప్రజా క్షేత్రంలోకి వెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలోనే పార్లమెంటు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ "సమాజానికి మేలు చేయాలన్న పార్టీ సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటే పార్టీని అధికారంలో నిలబెట్టాలి. అందుకోసం ముందు పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలి. కార్యకర్తల నుండి నాయకుల వరకు అందరూ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అలుపెరుగక శ్రమించాలి. నాడు ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో గానీ.. ఇంతటి పటిష్టమైన కార్యకర్తల బలం గల పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎంతో మంది నాయకులు వ్యక్తిగత స్వార్ధంతో పార్టీని వీడినా.. పటిష్టమైన కార్యకర్తల కారణంగానే మన పార్టీ ధృఢంగా నిలబడుతోంది. ఇన్నేళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం.. కానీ ప్రజాసేవను వీడలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో కార్యకర్తలు స్థిరంగా ఉన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి దారి చూపించాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం కంటే మనం ముందుండేవాళ్లం. కానీ.. గత రెండేళ్లలో దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఈ ముఖ్యమంత్రి ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రానికి వచ్చిన మంచి పేరుతో నాశనం చేశారు. ఎన్నడూ లేనంతటి చెత్త పేరు తీసుకొచ్చారు. కార్యకర్తలు సహా రాష్ట్ర స్థాయి ప్రతి నాయకుడు పోరాడాలి. అలా చేసినపుడే పార్టీకి మనుగడ ఉంటుంది. గత మహానాడులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించాం.

achem 28052021 2

గతంలో జిల్లా కమిటీలతో ప్రజలకు చేరువవ్వడం కష్టమవుతోందని భావించి.. పార్లమెంటు కమిటీలు ఏర్పాటు చేయాలని భావించాం. అధ్యక్షులను కూడా నియమించుకున్నాం. క-రో-నా, వరుసగా జరిగిన ఎన్నికల కారణంగా పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేసుకోలేకపోయాం. మహానాడు అయిన 10 రోజుల్లోనే పార్లమెంటు కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించాం. పార్టీ పటిష్టత కోసం పోరాటం చేసిన వారిని, కార్యకర్తలకు అండగా నిలిచిన వారికి ప్రాధాన్యమిస్తాం. అన్ని వర్గాల వారికీ అవకాశాలు కల్పిస్తాం. క-రో-నా కారణంగా సభ్యత్వ నమోదును కూడా క్షేత్రస్థాయిలో చేసుకోలేకపోతున్నాం. బూత్ కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వంటి పటిష్టమైన వ్యవస్థ ఉంది. దాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుందాం. మరో వైపు అనుబంధ సంఘాలను కూడా పూర్తి స్థాయిలో నియమిద్దాం. జగన్ రెడ్డి దుర్మార్గ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసు పెడుతున్నారు. రోడ్డెక్కి మాట్లాడితే ఆస్తులు ధ్వం-సం చేస్తున్నారు. అవి చూసి ప్రశ్నించేందుకు టీడీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. కేసులు పెట్టనివ్వండి, అరెస్టులు చేయనివ్వండి. పోరాటం చేసినపుడే మనకు గుర్తింపు వస్తుందని గుర్తుంచుకోండి. కార్యకర్త సహా.. రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నిలదీయండి. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు పార్టీ పటిష్టత కోసం పనిచేయాలి. వచ్చే మూడేళ్లు చావో రేవో అన్నట్లు కార్యకర్తలు పోరాడాలి. కేసు పెడతారని బెదిరిస్తే.. భయపడేది లేదు. వారికి పార్టీ అండగా ఉంటుంది. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని త్వరలో మరోసారి అరెస్టు చేస్తారని మెసేజ్ పెడుతున్నారు. నాకేం భయం లేదు. పంచె, టీ షర్ట్ తో ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను.

Advertisements

Advertisements

Latest Articles

Most Read