ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. గవర్నర్‌ ప్రసంగానికి తీర్మానాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదోర ప్రవేశపెట్టరు. దీనిని ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు బలపరిచారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యే అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ తరుపున మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం అంటే, ప్రభుత్వ చేసే పాలసీ డాక్యుమెంట్‌ అని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయస్సును ప్రతిబింబించేలా గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని మేము అందరం భావించామని చెప్పారు. గవర్నర్‌ చేసిన ప్రసంగంలో ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం పై వివరాలు లేవని విమర్శించారు. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్న అమరావతి అనే ప్రస్తావనే లేదని అన్నారు.

మాటి మాటికి పట్టిసీమ వృథా ప్రాజెక్టు, అది వేస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు, పట్టిసీమ వృథా ప్రాజెక్టు అయితే మోటార్లు ఆన్‌ చేయడం మానండని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పట్టిసీమ మోటార్లు ఆన్‌ చేయడం మానేస్తే రైతులకు ఎంత ఆగ్రహం వస్తుందో, ఆ రియాక్షన్ ఏంటో మీరే చూస్తారని అచ్చెన్నాయుడు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఖర్చుపై ఇన్ని చెప్తున్నారని, ఖర్చు పై మాత్రమే కాదని, ఆ ప్రాజెక్ట్ ప్రయోజనాలపై కూడా మాట్లాడాలని నిలదీశారు. పోలవరం పనులను 70 శాతం పూర్తి చేశామని వివరించారు. మిగతా 30 శాతం పనులు త్వరగా పూర్తిచేయాలని తాము వైసీపీని కోరుతున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిందని, పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. అయితే పట్టిసీమ వేస్ట్ అంటున్నారు కదా, మోటార్లు ఆన్‌ చేయకండి అని అచ్చెన్నాయుడు అడిగిన దానికి, సభలో సమాధానం చెప్పలేక పోయింది వైసీపీ...

Advertisements

Advertisements

Latest Articles

Most Read