అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉప నేతలు, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుకి ప్రివిలేజ్ కమిటీ షాక్ ఇచ్చింది. వీరు ఇరువురు కూడా జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దుషించారని చెప్పి, ప్రివిలేజ్ కమిటీ అభిప్రాయ పడింది. గతంలో శాసన సభలో జరిగిన చర్చలో, పెన్షన్ల పై జరిగిన చర్చని ఈ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి, నిమ్మల రామానాయుడి పై ఇచ్చిన తీర్మానాన్ని, ప్రివిలేజ్ కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఈ పరిగణలోకి తీసుకుని, జగన్ మోహన్ రెడ్డిని దుషించారనే ఉద్దేశంతో, వారికి అసెంబ్లీలో ఇక మైక్ ఇవ్వకూడదని ప్రివిలేజ్ కమిటీ భావించింది. దీనికి సంబంధించి, నిర్ణయం తీసుకున్నా కూడా, వచ్చే సమావేశాల్లో చర్చించి, స్పీకర్ కు పంపాలని భావించారు. అయితే ఈ ప్రతిపాదనను, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు అనగాని సత్య ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్ మోహన్ రెడ్డి ముందుగా, రామానాయుడిని డ్రామానాయుడు అంటేనే, తిరిగి రామానాయుడు మాట్లాడారని , కావాలంటే రికార్డులను పరిశీలించుకోవాలని సూచించారు. ఈ నేపధ్యంలోనే ప్రివిలేజ్ కమిటీలో మెజారిటీ సభ్యులు వైసీపీ వారు ఉండటంతో, ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు.

ramanaidu 21092021 2

వచ్చే సమావేశంలో, ఇది స్పీకర్ కు పంపిస్తామని వీళ్ళు భావిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం అనగాని మాట్లాడుతూ, రికార్డులు పరిశీలించుకోవాలని కోరానని, ఎవరు ఎవరు ఏమి మాట్లాడారో చూడాలని చెప్పనా, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని, ఇది అప్రజాస్వామికం అని అన్నారు. అయితే ఇక మరో టిడిపి నేత కూన రవి కుమార్, స్పీకర్ ని దుషించారని ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. గతంలో తాను హైదరాబాద్ వెళ్ళటం వలన రావటం కుదరలేదని, మరో డేట్ ఇవ్వలేని ఆయన లేఖ పంపించారు. అదే విధంగా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రాసిన లేఖ కూడా ప్రివిలేజ్ కమిటీ పరిశీలించింది. అయితే నిమ్మగడ్డ తన పై ఏమి ఫిర్యాదు వచ్చిందో మరింత సమాచారం కోరారని, కోర్టు పరిధిలో ఉన్న అంశం అయినంత మాత్రాన, దాన్ని ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూడదనేం లేదని, నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన లేదేమో అంటూ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read