ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అన్ని అనుమతులూ ఉన్నాయని, అవన్నీ చూసిన తరువాతే చంద్రబాబు ఆ ఇంట్లోకి వెళ్ళారని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తెలుగుదేశం పార్టీ నేతలు ఆధారాలుతో సహా బయటపెట్టారు. మీడియాతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్ని వివరాలు చెప్పారు. "2015 తర్వాత సీఆర్డీఎ కొత్త చట్టం తెచ్చింది. 2015 కంటే ముందు పాత చట్టాలు ఉన్నాయి. చంద్రబాబు ఉంటున్న భవనం 2011కు ముందు కట్టారు . అప్పుడు సీఆర్డీఎ అనేది లేదు. గ్రామ పంచాయతీ దగ్గర అనుమతులు తీసుకుని కట్టారు. ఆరోజే ఈ భవన యాజమాని, వన్ ప్లస్ వన్ గా ఈ బిల్డింగ్ కట్టుకున్నారు. ఆనాడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొంటే సరిపోతుంది అనేది, వీళ్ళు గుర్తుంచు కోవాలి. ఇన్ని వివరాలు ఇచ్చినా, ఈ ప్రభుత్వం పెద్దలకు ఇదంతా తెలిసినా వినరు, ఎందుకంటె, వీరికి చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ధ్యేయం ఉంది."

"అందుకే ఈ విషయాలు అన్నీ ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకుని , ప్రజలకే చెప్తున్నాం. ఈ భవనం కట్టడానికి, 2011 లో, అప్పటి పంచాయతీ తీర్మానం తీసుకుని, రివర్ కన్వర్జేషన్ యాక్టు ప్రకారం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని, అన్ని అనుమతులు వచ్చిన తరువాతే ఈ భవన యజమాని, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోడానికి, ఒక భవనం కట్టుకోడానికి అనుమతి తీసుకున్నారు. ఇది వ్యవసాయ భూమి కావటంతో, ఇకక్డ భవనం కట్టాలంటే కన్వర్షన్ చేసుకోవాలి. అందుకని వ్యవసాయ భూమిని, వాణిజ్య భూమిగా మార్చే కన్వర్షన్ కోసం, సుమారు రూ. 18లక్షలు నాలా పన్ను కట్టారు. ఇన్ని వాస్తవాలు ఉంటే చంద్రబాబునాయుడు అనుమతి లేని భవనంలో ఉంటున్నారని,ప్రచారం చేస్తున్నారు." అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. పంచాయతీ తీర్మానం, నాలా పన్ను రసీదు , రివర్ కన్జర్వేషన్ యాక్టు నో అబ్జషణ్ సర్టిఫికేట్ లను మీడియాకు అందజేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read