విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం 3గంటలకు ప్రారంభించారు... మూడు రోజులపాటు జరిగే సదస్సుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు సురేష్‌ప్రభు, అశోక్‌గజపతిరాజు, 40 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. పలువురు విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ప్రారంభ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు మాట్లాడారు... చంద్రబాబు విజన్ ని మెచ్చుకుంటూ, ఆయన కృషిని, ఆయన రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని కొనియాడారు...

adani 24022018 2

ఈ సదస్సులో పారిశ్రామిక వేత్త గౌతం అదానీ మాట్లాడుతూ గుజరాతీలు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులుగా పేరు గడించారని, కానీ ఇప్పుడు గుజరాతీల స్థానాన్ని తెలుగువారు ఆక్రమించేలా ఉన్నారని ఆయన కితాబిచ్చారు. వారిని ఇలా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు కృషి ఉందని, ఏపీలో పారిశ్రామిక విధానాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. పారిశ్రామిక భారత్‌ నిర్మాణంలో కేంద్రానికి ఏపీ సహకరిస్తోందని అదానీ తెలిపారు... అంతే కాదు ఆదానీ మాట్లాడుతూ "If there is one leader who India should be proud of for not losing to Silicon Valley it is you Mr. Chief Minister.. Your talk at Davos was most inspiring and raised value of India and Andhra Pradesh at an international stage.." అంటూ చంద్రబాబుని ప్రశంసించారు...

adani 24022018 3

అలాగే CII ప్రెసిడెంట్ మాట్లాడుతూ "I’m so proud to be speaking here as First Telugu to be CII president sharing stage with a Telugu Vice President of India, Telugu Civil Aviation Minister and our very own Telugu Chief Minister Chandrababu Naidu" అని అన్నారు... కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ "Andhra Pradesh is a proud Entrepreneurial State of India. I’m proud to represent this amazing state in the Parliament. " అని అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read