గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త గౌతమ్‌ ఆదాని, అంటే దేశంలో తెలియని వారే ఉండరు.. ప్రధాని మోడీకి సన్నిహితుల్లో అదానీ ఒకరు... మోడీ, అమిత్ షాకు అదానీ అత్యంత సన్నిహితుడు అనే ప్రచారం ఉంది... అది వాస్తవం కూడా... ఇది ఇలా ఉంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి పక్ష నాయకుడు వైఎస్ జగన్, ఆదానీ మధ్య పరిచయాలు ఉన్నాయి... ఆ పరిచయాలతోనే 2014లో, ఆదానీ ద్వారా బీజేపీతో పొత్తుకు ప్రయత్నించారు... అప్పట్లో జగన్, ఆదానీ కలుసుకోవటం సంచలనం అయ్యింది... కాని అప్పట్లో, మోడీ, జగన్ తో కలవటానికి ఒప్పుకోకుండా, చంద్రబాబు వైపే మొగ్గు చూపారు...

adani 22012018 2

ఈ మధ్య జగన్, ఉన్నట్టు ఉంది ప్రధానిని కలవటానికి కూడా, ఆదానీ ద్వారానే అప్పాయింట్మెంట్ సంపాదించారు అనే ప్రచారం కూడా ఉంది.. ఆదానీ ద్వరా, మోడీతో లింక్ కుదుర్చుకుంటున్నారు జగన్, అని చంద్రబాబు గ్రహించారు... ఆ లింక్ మీద దెబ్బ దెబ్బకొట్టే రాజకీయ ఎత్తుగడ వేసారు చంద్రబాబు... అందుకే, జగన్ ఏ మార్గం అయితే ఎంచుకుని ఆదానికి దగ్గర అయ్యారో, ఆ వ్యాపార మార్గంలోనే ఆదానిని దగ్గర చేసుకుని, జగన్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసారు... జగన్ ఏ మార్గంలో, ఇబ్బంది పెట్టాలి అని ప్లాన్ చేసాడో, అదే మార్గంలో జగన్ కు రివర్స్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి రెడీ అయ్యారు...

adani 22012018 3

అందుకే శ్రీకాకుళం జిల్లా భావనపాడులో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ నాన్‌ మేజర్‌ పోర్టు నిర్మాణ బాధ్యతలను అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌కు అప్పగించాలని, చంద్రబాబు నిర్ణయించారు... పోటీదారులుగా నవయుగ, గంగవరం పోర్ట్ కూడా రేసులో నిలిచినా, చివరకు వారు తప్పుకున్నారు... భావనపాడు పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్టును.. అదానీ సంస్థ చేపడుతుంది. ఇందుకు గాను తొలి 30 ఏళ్లలో మొత్తం ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్రప్రభుత్వానికి చెల్లిస్తుంది. 31 నుంచి 40 ఏళ్ల వరకు 4.6 శాతం.. 41 నుంచి 50 ఏళ్ల వరకు 9.2 శాతం వాటాను ఇస్తుంది. ఇటీవల కేరళలోనూ అదానీ సంస్థ ఓడరేవు నిర్మాణం చేపట్టింది. దీంతో.. రాష్ట్రంలోనూ ఆ సంస్థ ఓడరేవు నిర్మాణం పనులు చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయశాఖ, అడ్వకేట్‌ జనరల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read