ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పులు మీద తప్పులు చేస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి ఏది అనిపిస్తే అది చేయడమే తమ విధానంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. అమరావతిని మూడు ముక్కలు చేసారు. సౌత్ ఆఫ్రికా తమకు ఆదర్శం అన్నారు. రెండేళ్ళు గడిచిన తరువాత, తూచ్ అంటూ కొన్ని రోజుల క్రితమే మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకున్నామంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలు ప్రకారం, తాజాగా రాజధాని విషయంలో ఏపీ హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేశారు. హైకోర్టుకు అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామని, అమరావతిలో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నామని, కరకట్ట రోడ్డును విస్తరిస్తున్నామని, ఇప్పటికే శంకుస్థాపన చేసామని, ఇలా కొన్నికీలక అంశాలను ఈ అఫిడవిట్ జాబితాలో ఉంచారు. రెండున్నర ఏళ్ళు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని విషయంలో ఇంత వరకు స్పష్టత లేదు. జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిలో ఒక్కటంటే ఒక్కఅభివృది పని జరగలేదు అనేది తెలిసిందే. అయితే అభివృద్ధి అనేది ఏమి జరగక పోగా విధ్వంసం మాత్రం అమరావతిలో జరిగింది. ఇంకా చెప్పాలి అంటే, ఈ రాష్ట్రంలో విధ్వంసం మొదలైందే అమరావతి నుంచి అనేది అందరికీ తెలిసిందే.
అక్కడ ఉన్నప్రజా వేదికను మొదటగాకులగోట్టారు. నిర్మాణంలో ఉన్న భవనాలు పాడు బెట్టారు. తరువాత మూడు ముక్కలు అన్నారు. ఇప్పుడేమో మళ్లీ అమరావతిలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పటానికి రెండో అఫిడవిట్ దాఖలు చేశారు. మొదట ఇచ్చిన అఫిడవిట్లోనేమో మూడు రాజధానులు కడతామని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ, అమరావతిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పటం, ఏమిటో అర్ధం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పిటిషన్లుకు సంభందించి వివాదాస్పదంగా మర్చి, పరిష్కారం కాకుండా ఉండాలనే ప్రభుత్వం ఇలా చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మళ్ళి అమరావతిలో అభివృధి చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా జగన్ గారు, మీ స్వార్ధ రాజకీయాల గురించి కాకుండా ఒక్కసారి రాష్ట్ర భవిషత్తు గురించి ఆలోచించండి, రాజధాని విషయంపై రోజుకొక మాట ఎందుకు మారుస్తున్నారు అని అమరావతి రైతులు వాపోతున్నారు. వైసిపి వాళ్ళు అధికారం లోకి వచ్చి ఇన్ని రోజులైనా రాజధాని పై అసలు స్పష్టత లేదు, ప్రజలందరూ కోరుకునే అమరావతిని రాజధానిగా ఉంచకుండా, మూడు రాజధానులు అని ఒకసారి, ఉపసంహరించుకుంటున్నామని ఒకసారి, మళ్ళీ పెడతామని ఒకసారి, ఇలా రకరకాల వాదనలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.