సీరియస్‌గా జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన సరదా వ్యాఖ్యలకు అంతా ఒక్కసారిగా నవ్వేశారు. సమావేశం జరుగుతుండగా మధ్యలో కల్పించుకొని మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి.. తితలీ, ఫణి తుపాన్ల గురించి ముందే చెప్పిన ఆర్టీజీఎస్ బాబు.. ఎన్నికల్లో ఓట్ల సునామీ గురించి ముందే చెప్పరా? అని సీఎంను ఉద్దేశించి అన్నారు. దీంతో కేబినెట్ సమావేశంలో మంత్రులంతా ఒక్కసారిగా నవ్వారు. మంత్రి వ్యాఖ్యకు స్పందించిన సీఎం చంద్రబాబు అంతే చమత్కారంగా బదులిచ్చారు. ఓట్ల సునామీ గురించి మీ చెవిలో చెబుతారులే అని సమాధానం ఇచ్చారు.

adinarayana 14052019

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో కేంద్రం అనుమతించిన నాలుగు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఫొని తీవ్ర తుపానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ భేటీకి ముగ్గురు మంత్రులు మినహా మంత్రులంతా హాజరై పలు సూచనలు చేసినట్టు సమాచారం. తమ శాఖలకు సంబంధించిన అంశాలను ఇందులో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఈ భేటీలో పాల్గొన్నారు. విపత్తు నిర్వహణ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శులు సైతం ఈ భేటీలో పాల్గొని తమ శాఖలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

adinarayana 14052019

ఫొని తుపాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తదుపరి అంచనాలపై సర్వే జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని, సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోయాని విపత్తు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ కార్యదర్శులు వివరించారు. ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఐదు విభాగాల్లో తొలిస్థానం, ఆరు విభాగాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉపాధిహామీ, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులను అభినందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read