సెక్రటేరియట్ లోని 32 శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రధాన కార్యదర్శుల కు ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలు చూస్తుంటే, ప్రభుత్వ నిర్వహణలోని వ్యవస్థలు ఎంతలా దిగజారిపోయాయో అర్థమవుతోందని, అన్ని శాఖల అధికారులు విధిగా కార్యాలయాలకు రావాలని సీఎస్ చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వశాఖల పనితీరుకి చీఫ్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. సాధారణంగా కలెక్టర్లు, లేదా ప్రధాన శాఖాధిపతులు ఆ విధమైన ఆదేశాలు ఉద్యోగులకు ఇస్తుంటారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారే సచివాలయంలోని శాఖాధిపతులతో అందరూ విధిగా కార్యాలయాలకు రావాలని చెప్పడం రాష్ట్ర చరిత్రలో ఇప్పుడే వింటున్నాం. గతంలో ప్రతిపక్షం తరుపున తాము విజ్ఞాపనలు ఇవ్వడానికి, సచివాలయానికి వెళ్లినప్పుడు కూడా అనేక మంది అధికారులు గైర్హాజరవడాన్ని గమనించాం. అక్కడున్నవారిని అడిగితే, సదరు అధికారి వేరేచోట ఉన్నారని, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నారని చెప్పిన సందర్భాలు అనేకమున్నాయి. వివిధ శాఖాధిపతులు సచివాలయంలోలేని రోజులు అనేకం ఉన్నాయి. ఈ వ్యవహారంపై సదరు శాఖాధిపతులు తమకు పెద్దగా పైస్థాయిలో పనిలేదని చెబుతున్నారు. అంతా గ్రామ స్థాయిలోనే జరుగుతోందని, తమదాకా ఏ వ్యవహారము రావడంలేదని కూడా చెబుతున్నారు. ప్రభుత్వానికి పరిపాలన అంటే ఏమిటో కూడా తెలియడం లేదు. ఇటీవల స్త్రీ సంక్షేమం విభాగంకింద నియమితులైన మహిళా ఉద్యోగులను, మహిళాకానిస్టేబుళ్లుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పడమే అందు కు రుజువు. స్త్రీసంక్షేమం కింద నియమితులైన ఆడపిల్లలు, ఆయా విభాగంలో పనిచేయడానికి ఇష్టపడతారు కానీ, ఒక యూనిఫామ్ వేసుకొని మహిళా పోలీసు కానిస్టేబుళ్లుగా పనులుచేయడానికి ఇష్టపడరు. వారినే భవిష్యత్ లో పోలీస్ శాఖ నియామకాల్లో చూపి, సదరుశాఖలో ఎలాంటి మహిళ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం చేసేప్రమాదముంది. ఇటీవలే డీజీపీ చెప్పారు.. సంవత్సరానికి ఏడువేల పోస్టులు భర్తీచేస్తామని. స్త్రీ శిశుసంక్షేమశాఖ కింద నియమించినవారిని మహిళా కానిస్టేబుళ్లుగా నియమించడమనేది చట్టప్రకారం జరిగిందా? లేక ప్రభుత్వం చేతిలో పవర్ ఉంది కదాఅని ఇష్టమొచ్చినట్లు చేస్తోం దా? గ్రామసచివాలయాల్లోని ఉద్యోగులు ఎందరు.. వారికున్న అధికారాలు ఏమిటనేది తెలియడంలేదు. వాలంటీర్లు, సచివాలయాల్లోని ఉద్యోగులద్వారానే రిజిస్ట్రేషన్లు చేయడమనేది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.


శాఖాధిపతులకు, మంత్రులకే తెలియకుండా కింది స్థాయిలో పాలన జరుగుతోందంటే, అది ఎవరికి నష్టమో ప్రభుత్వం ఆలోచించాలి. సీపీఎస్ ను ప్రభుత్వం రద్దు చేయలేదు.. పీఆర్సీ ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. డీఏలు బకాయిలు జీపీఎఫ్ ఖాతాకు మళ్లించినట్టే, మళ్లించి తిరిగి వెనక్కు తీసుకున్నారు. ఇంత జరిగినా ఉద్యోగ సంఘాల నాయకులు మౌనవ్రతం పాటిస్తున్నారు తప్ప, ప్రభుత్వాన్ని , ముఖ్యమంత్రిని నిలదీయడం లేదు. ఈ ప్రభుత్వమున్నంత కాలం ఉద్యోగ సంఘాల నేతలు మౌనాన్నే నమ్ముకున్నట్లు అనిపిస్తోంది. పెన్షనర్లకు అందాల్సిన డీఏలు అందడం లేదు. పింఛన్లు తీసుకునేవారు ఏవైనా ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నా, వారి వినతులు మూడు నుంచి ఆరు నెలల వరకు పెండింగ్ లోనే ఉంటున్నాయి. ప్రభుత్వం కట్టించుకునే ఏపీజీఎల్ఐ (ఇన్సూరెన్స్ పథకం) లో ఈరోజుకి రూ.71కోట్ల వరకు క్లెయిమ్స్ పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ విధంగా ఉద్యోగులు, పింఛన్ దారులు అందరూ ఇబ్బందుల పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థికపరమైన అసమానతలు, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వెరసి పాలన గాడితప్పింది. అధికారులు తమకేమీ పట్టనట్టే నిస్తేజంగా వ్యవహరిస్తున్నారు. రౌతుని బట్టే గుర్రం ఉంటుంది. మామూ లు గుర్రాన్ని కూడా నేర్పరి అయిన రౌతు బ్రహ్మండంగా పరిగెత్తించగలడు.

adityanadh 14082021 2

ముఖ్యమంత్రి అలా ఉంటే, అధికారులు, పాలన ఇలా ఉండక ఎలా ఏడుస్తుంది. సీఎం కేవలం రెండు పనులకు మాత్రమే బయటకొస్తాడు. బటన్లు నొక్కడానికి, రిబ్బన్లు కత్తిరించడానికి మాత్రమే ఆయన పనికొస్తాడు. ప్రభుత్వ విధానాలు, పాలన వ్యవహారాలపై మంత్రులు, ముఖ్యమంత్రే మాట్లాడాలి. సలహాదారులకు ఏం అధికారముంది.. వారికున్న విశ్వసనీయత ఏమిటి? రాష్ట్రంలో ఎందరు మంత్రులున్నారు.. వారి శాఖలేమిటోకూడా చాలామందికి తెలియదు. రాష్ట్రానికి హోంమంత్రి, రెవెన్యూ మంత్రి ఎవరనే ప్రశ్నలకు చాలా మంది ప్రజలకు సమాధానం తెలియదు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా 15 ఏళ్లవరకు వెనక్కు వెళ్లిందనేది వాస్తవం. బూతులు, అబద్ధాలు అలవోకగా మాట్లాడే మంత్రులు వారి ఛాంబర్లలో సచివాలయంలో ఎన్నాళ్లు కూర్చుంటున్నారో చెప్పగలరా? రాష్ట్రాన్ని, వ్యవస్థలను గాడిలోపెట్టడం అంతతేలికగా అయ్యేపనికాదు. పరిపాలనంటే అంతతేలిక కాదని ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు ఆలోచిస్తే మంచిది. ప్రభుత్వం, పరిపాలన గాడి తప్పాయని టీడీపీ ఘంటాపథంగా చెబుతోంది. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్న ఉద్యోగసంఘాల నాయకులు పరిపాలనపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. లేకుంటే పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. వ్యవస్థలను చక్కబెట్టి, పరిపాలన సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనేఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read