వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై హైకోర్టు నమోదు చేసిన క్రిమినల్ రివిజన్ పిటీషన్ కు సంబంధించి, నిన్న హైకోర్టులో సుమోటో కేసు పై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, హైకోర్ట్ స్పందిస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామా ని చెప్పగా, అడ్వొకేట్ జనరల్ మాత్రం, ఈ 11 కేసుల్లో కొన్ని కేసులు పై తమకు అబ్జక్షన్స్ ఉన్నాయని, దాని పై వాదనలు వినిపిస్తాం అని చెప్పారు. ఈ వాదనలు వినిపిస్తున్న నేపధ్యంలోనే ఆయన అనంతపురంలో 5 కేసులు, గుంటూరు జిల్లాలో ఆరు కేసులకు సంబంధించి, ప్రసిక్యుషన్ విత్ డ్రా చేసుకున్నారని చెప్పూర్. దీని పై ఎవరు అయితే ఫిర్యాదు చేసారో, ఫిర్యాదుదారులు అనుమతి లేకుండా, ప్రభుత్వమే విత్ డ్రా చేసుకోవటం పై కూడా క్రిమినల్ రివిజన్ పిటీషన్ లో, హైకోర్టు ఒక కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకుని, ఆ నివేదిక ఆధారంగా, ఈ కేసున హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అయితే ఈ సందర్భంగా, అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ క్రిమినల్ రివిజన్ పిటీషన్ కు సంబంధించి, నోటీసులు ఇవ్వబోయే ముందే, కొన్ని మీడియా చానల్స్ కు ఎలా తెలిసింది అంటూ హైకోర్టుని ప్రశ్నించారు. అలా ఎలా మీడియాకు ముందే తెలుస్తాయి అంటూ ప్రశ్నించారు. అలాగే అసలు ఈ పిటీషన్ కు విచారణ అర్హత ఉందా లేదో కూడా చూడాలని హైకోర్టుని కోరారు.
అదే విధంగా, న్యాయ పరమైన వ్యవహారాలను, పాలన పరమైన కమిటీ ఎలా నిర్దారిస్తుందని ప్రశ్నించారు. ఇంతకు ముందు పదవీ విరమణ చేసిన జస్టిస్ రాకేశ్ కుమార్ ఇచ్చిన ఒక తీర్పుకి సంబంధించి కొన్ని అంశాలు చదివి వినిపించారు. అందులో ఈ 11 కేసులు కూడా సైట్ అయ్యి ఉన్నాయని కోర్టుకు చెప్పారు. అయితే ఇక్కడ హైకోర్టు కేసుని సుమోటోగా తీసుకుంటే, దీనికి విచారణ అర్హత ఉందా అని మళ్ళీ కోర్టునే ప్రశ్నించటం పై, పలువురు న్యాయవాదులు ఆశ్చర్య పోతున్నారు. ప్రభుత్వ ప్లీడర్ వాదనలో పసలేదని అన్నారు. సుమోటోగా తీసుకుంది అంటే, హైకోర్టు అన్నీ పరిశీలించి తీసుకుంటుందని, ఇక దీనికి విచారణ అర్హత ఉందా అని అడగటమే, తప్పు అని పలువురు న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక మీడియాలో వచ్చిన వార్తలు అనేవి, ప్రతి మీడియా సంస్థ ఇవి చేస్తుందని, జగన్ మోహన్ రెడ్డి సాక్షి కూడా ఇలాంటివి అనేకం వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బలవంతంగా కేసులు విత్ డ్రా చేయటం పై, కచ్చితంగా విచారణ జరగాలని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.