భాజపా అగ్రనేత అడ్వాణీ వాగ్ధాటి ఎంతటిదో అందరికీ తెలిసిందే. 2012 ఆగస్టు 8న అసోంలోకి అక్రమంగా చొరబడుతున్న శరణార్థుల గురించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత అడ్వాణీ ప్రసంగిస్తుండగా.. దాదాపు 50 సార్లు అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ ఆయన తన ప్రసంగాన్ని మాత్రం కొనసాగించారు. ఆరోజు తన ప్రసంగంలో దాదాపు 5వేల పదాలను ఉపయోగించారు. మళ్లీ 2019, జనవరి 8న ఎన్డీయే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ జరిగింది. అదే అంశంపై చర్చ జరిగినప్పుడు అడ్వాణీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

adwani 09022019

గత ఐదేళ్ల కాలంలో అడ్వాణీ లోక్‌సభలో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన కేవలం 365 పదాలు మాత్రమే మాట్లాడారు. అది కూడా 2014లోనే. గత ఐదేళ్లలో ఆయన లోక్‌సభలో మాట్లాడిన సమయం మూడు నిమిషాల కంటే తక్కువే. డిసెంబరు 19, 2014 తర్వాత ఆయన ఒక్కసారి కూడా లోక్‌సభలో మాట్లాడినట్లు రికార్డుల్లో లేదు. 2009 నుంచి 2014 వరకు చూసుకుంటే అడ్వాణీ దాదాపు 42 డిబేట్లలో పాల్గొని 35,926 పదాలు మాట్లాడారు.

adwani 09022019

హాజరు భేష్‌.. అనారోగ్య కారణాల వల్ల అడ్వాణీ చాలా తక్కువ సందర్భాల్లో బయట కనిపిస్తున్నారు. కానీ లోక్‌సభలో ఆయన హాజరు మాత్రం అందరి కంటే చాలా బాగుంది. గత ఐదేళ్లలో ఆయన హాజరు 92శాతంగా ఉంది. 2014 జూన్‌ 4 నుంచి 2019 జనవరి 8 వరకు 16 లోక్‌సభ సెషన్స్‌ జరిగాయి. 321రోజులు సభ నిర్వహించారు. వీటిలో 296 రోజులు అడ్వాణీ సభకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంలోని మంత్రుల కంటే అడ్వాణీ హాజరుశాతం అద్భుతంగా ఉంది. నిజానికి యూపీఏ హయాంలో కంటే ఎన్డీయే హయాంలో జరిగిన సమావేశాలకు అడ్వాణీ ఎక్కువగా హాజరయ్యారు. 2009 నుంచి 2014 వరకు ఆయన హాజరు శాతం 91.

Advertisements

Advertisements

Latest Articles

Most Read