మళ్లీ ఇసుక గగనమైంది..అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు ర్యాంపులు మూతపడ్డాయి. ఇంటికే ఇసుక సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏకంగా డీసిల్టేషన్ ర్యాంపులను సైతం దాదాపు నెల రోజులకు పైగా మూసివేసింది. దీంతో ఇటు ర్యాంపుల్లో ఇసుక లభించడం లేదు. అటు స్టాక్ పాయింట్ల లోనూ ఇసుక కానరావడం లేదు. మొత్తానికి ఇంటికే ఇసుక సరఫరా చేస్తామనే ప్రభుత్వ నినాదం కాస్తా కార్యరూపం దాల్చలేదు. ఏపి ఎండీసీ మాత్రం ప్రస్తుతం అఖండ గోదావరి నది కుడి గట్టు వైపు ఇసుక విక్రయాలు జోరుగా సాగిస్తోంది. ఎడమ గట్టు వైపు మాత్రం ఇసుక లభిం చడం లేదు. కావాలనే ఈ విధంగా చేయడం వల్ల మరింత ప్రియంగా ఇసుక వ్యాపారం సాగవచ్చని, ఈ విధానంలో అయితే తక్కువ కాలంలో ఎక్కువ ప్రలోభం పొందవచ్చని ఏపీ ఎండిసి ఈ కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరో పణలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుండగా అధికారుల లెక్కలకు, క్షేత్రసా యిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. డీసిల్టేషన్ పాయింట్లు 6, 22 ఓపెన్ శాండ్ రీచ్ లు, 29 పట్టా భూముల్లో కలిపి 57 ర్యాంపుల్లోనే ఇసుక లభిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

వీటి ద్వారా 30 లక్షల 85వేల 324 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్టు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఇసుకను ఏపీ ఎండీసీ విక్రయాలు సాగించాల్సి ఉంది. ఆరు డీసిల్టేషన్ ర్యాంపుల్లో ఇసుక కార్యకలా పాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్న ప్పటికీ ఆయా ర్యాంపులకు తాళాలు వేసి ఉన్నాయి. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపో యాయి. ర్యాంపు నుంచి ఇసుక బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాస్తవానికి డీసిల్టేషన్ ర్యాంపుల నుంచి ఇసుకను స్టాక్ పాయింట్లలోకి చేర్చి అక్కడ నుంచి ఇంటికే నేరుగా ఇసుకను చేర్చే విధంగా డిసిల్టేషన్ ర్యాంపుల్లో ఇసుక వెలికితీత నిలుపుదల చేశారు. ఇందుకు సంబంధించి ట్రాన్స్పర్టు లారీల ఛార్జీలు ఎంత చెల్లించాలనే విషయం కూడా ఇంకా తేలలేదు. గత నెల రోజులకు పైగా రూ. లక్షలకు పైగా ఖర్చు చేసి సిద్ధం చేసిన స్టాక్ పాయింట్లు నిరుపయోగంగా ఉన్నాయి. వేయింగ్ మిషన్లు కూడా అక్కడ ఖాళీగా ఉన్నాయి. దీనితో పాటు 17 ఓపెన్ ర్యాంపులు, 18 బోట్ల ద్వారా ఇసుక తీసే ర్యాంపులు, 8 పట్టా భూముల్లో ఇసుక తీసే ప్రాంతాలు వెరసి 31 చోట్ల ఇసుక లభిస్తున్నట్టుగా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

ట్రాక్టర్లతో డోర్ డెలివరీ 1282 ఎంటిలు, ఆరు చక్రాల లారీలతో 1840 ఎంటీలు, 10 చక్రాల లారీలతో 2772 ఎంటీలు రవాణా జరిగినట్టు అధికారులు నివేదిస్తు న్నారు. జనవరి 5వ తేదీ వరకు విశాఖకు, స్థానిక అవసరాలకు మొత్తం 11లక్షల 76వేల 518 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏపీ ఎండీసీ వంగలపూడి, పులిదిండి, జొన్నాడ, కాటవరం స్టాక్ పాయింట్లు పెట్టినట్టుగా చెప్పినప్పటికీ అవేవీ కన్పించడం లేదు. పట్టా భూముల్లో ఇసుక తీసుకు నేందుకు అనుమతి కావాల్సిందిగా ఎడమ గట్టు వైపు మొత్తం 81 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఐదు తిరస్కరించారు. మిగిలినవి పరిశీ లనలో ఉన్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 253 ట్రాక్టర్లకు, 184 ఆరు చక్రాల లారీలకు, 82 10 చక్రాల లారీలకు జీపీఎస్ అనుసంధానం చేసినట్టుగా చెబుతు న్నారు. కానీ సక్రమ విధానంలో వీటిని నిర్వహించడం లేదని క్షేత్ర స్థాయిలో తెలుస్తోంది. ఏదేమైనప్పటి ఇసుక డోర్ డెలివరీ చేస్తామని చెప్పి రాజమహేంద్రవరంలోని డీ సిల్టేషన్ ర్యాంపులను మూసివేసి నెల రోజులు కావస్తున్నా ఇంకా ఏపీ ఎండీసీ అధికారులు చర్యలు తీసుకోలేదు. రూ. లక్షలు ఖర్చు చేసిన స్టాక్ పాయింట్లలో వేయింగ్ మిషన్లకు పని లేక నిరుపయోగం పడి ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read