దావోస్ లో ఏపి లాంజ్ కి వచ్చిన, ఏజిల్ లాజిస్టిక్స్ సీఈవో, తన మాటలతో చంద్రబాబునే ఆశ్చర్యపరిచారు... చంద్రబాబు వెల్కమ్ చెప్పి, కూర్చోమని చెప్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇంట్రో ఇస్తూ ఉండగా, ఏజిల్ లాజిస్టిక్స్ సీఈవో, తరక్ సుల్తా అల్ ఎస్సా కలిపించుకుని, ‘మీరు మాచేత పెట్టుబడులు పెట్టించేందుకు మమ్మల్ని ఒప్పించనవసరం లేదు. ఎందుకంటే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మేము ఇప్పటికే స్థిర నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు... ఇది చంద్రబాబుకి ఉన్న బ్రాండ్ ఇమేజ్.... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏజిల్ లాజిస్టిక్స్ ద్వైపాక్షిక సమావేశం, దావోస్ లో జరిగింది... ఈ సమావేశంలో సంస్థ సీఈవో తరక్ సుల్తా అల్ ఎస్సా (Tarak Sulta Al Essa), డైరెక్టర్ ఉగెన్ మెన్ (Eugene Mayne), పాల్గున్నారు... ఆయన రావటం తోనే, ‘మీరు మాచేత పెట్టుబడులు పెట్టించేందుకు మమ్మల్ని ఒప్పించనవసరం లేదు. ఎందుకంటే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మేము ఇప్పటికే స్థిర నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు తరక్.... అది ఎప్పుడు ఎలా అనేదే ఆలోచిస్తున్నామని అని చెప్పారు... త్వరలో అమరావతికి వచ్చి తదుపరి కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రికి తెలిపారు ఆ సంస్థ సీఈవో....
వ్యాపార విస్తరణకు ప్రణాళికలతో ఉన్నామని తరక్, ముఖ్యమంత్రికి వివరించారు... భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని తలంచామని, ముఖ్యంగా సాంకేతికంగా ముందున్న ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించామని తెలిపారు... ప్రభుత్వ నేతగా ఉన్న వ్యక్తి నుంచి సాంకేతికతకు సంబంధించిన మాటలు వినడం తనకు అమితాశ్చర్యంగా ఉందని, సంస్థలకు సంబంధించిన వారు కూడా ఇంత పరిజ్ఞానంతో మాట్లాడలేరని వ్యాఖ్యానించారు... విమానాశ్రయాల్లో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహణ పట్ల ఈ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది... ఇప్పటికే ఇండియాలో ముంబై, ఆఫ్రికలో మరికొన్ని నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టుల్లో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది, ఏజిల్ లాజిస్టిక్స్ సంస్థ....