అగ్రిగోల్డ్ బాధితులు తమ డబ్బులు తిరిగి వస్తాయి అని ఎంతో ఆశ పెట్టుకుంది, ‘హాయ్‌ల్యాండ్’ భూములు ఉన్నాయని. అవి వేలం వేస్తే తమ డబ్బులు తమకు వస్తాయని అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పటికప్పు హైకోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అయితే ఈ ప్రక్రియ అవ్వకుండా, బీజేపీ, వైసీపీ నేతలు చెయ్యని ప్రయత్నం లేదు. ఇందులో భగంగా, హాయ్‌ల్యాండ్ మాది కాదు అంటూ యాజమాన్యం వాదనను తమకు అనుకూలంగా మలుచుకుని, దాన్ని చంద్రబాబు, లోకేష్ పైకి నెట్టి, హాయ్‌ల్యాండ్ భూములు చంద్రబాబు నొక్కేస్తున్నాడు అంటూ, కొత్త వాదన మొదలు పెట్టారు. అయితే ఈ కుట్రను వారం రోజుల్లో పోలీసులు చేధించారు.
హాయ్‌ల్యాండ్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి వెంకటేశ్వరరావుతో ‘దొంగ’ అఫిడవిట్ దాఖలు చేయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అల్లూరి సీఐడీ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. హాయ్‌ల్యాండ్‌పై పితలాటకానికి తెరలేపిన నేపథ్యంలో ఆయనను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హైకోర్టు ఆదేశాల మేరకు హాయ్‌ల్యాండ్‌ను వేలంలో విక్రయిస్తే తక్కువ డబ్బులే వస్తాయని, అసలు అది ‘అగ్రిగోల్డ్’ ఆస్తికాదని చెబితే పూర్తిగా మిగిలిపోతుందని చైర్మన్ అవ్వారు వెంకట రామారావు ఆలోచించారు. ఏలూరు జైలులో ఉన్న ఆయన వద్దకు అల్లూరి వెంకటేశ్వరరావును సంస్థ టెక్నికల్ అడ్వైజర్ రవికాంత్ తీసుకెళ్లారు. ములాఖత్‌లో భాగంగా వీరు కలిశారు. ‘‘హాయ్‌ల్యాండ్ ఎంతో ఖరీదైన ఆస్తి! వేలంలో తక్కువ ధరకే పోతుంది. అందుకే... హాయ్‌ల్యాండ్ మాది కాదని మేం చెబుతాం. అది మీదేనని కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్’’ అని వెంకటరామారావు సూచించారు.
నిజానికి... వెంకటేశ్వరరావు హాయ్‌ల్యాండ్‌లో ఒక ఉద్యోగి మాత్రమే. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఆయన ఎండీ హోదాలో నెలకు రూ.70వేల జీతం తీసుకుంటున్నారు. హాయ్‌ల్యాండ్ వ్యవహారంపై ఏపీ సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ సమక్షంలో వెంకటేశ్వరావును ప్రశ్నించారు. తనకేమీ తెలీదంటూనే అది తనది కాదని, అగ్రిగోల్డ్ యాజమాన్యానిదేనని చెప్పేశారు. నెలకు రూ.లక్ష జీతం కూడా లేని తనకు వందలకోట్ల విలువైన ఆస్తులు ఎలా వస్తాయని అన్నారు. మరి, కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ సంగతేమిటని నిలదీయగా... ‘‘రవికాంత్ నన్ను ఏలూరు జైలులో ఉన్న చైర్మన్ వద్దకు తీసుకెళ్లారు. హాయ్‌ల్యాండ్‌కు అగ్రిగోల్డ్‌తో సంబంధం లేదనేలా అఫిడవిట్ వేయాలని చెప్పారు. లీగల్ అడ్వైజర్ ఉదయ్ దినకర్ మొత్తం వివరాలు చెప్పి నాతో అఫిడవిట్‌పై సంతకం చేయించారు’’ అని వివరించినట్లు తెలిసింది. ఈ వివరాలతో శుక్రవారం హైకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనుంది. అయితే ఈ డ్రామా అంతా బయట పడటంతో, బీజేపీ, వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం, ఈ ప్రక్రియ పట్ల బీజేపీ హస్తం ఉందని, ఆ కుట్ర బయట పెడతాం అని చెప్తున్న నేపధ్యంలో, ఈ కుట్ర బయట పడింది.