అనంతపురం జల్లాలోని ఎస్.ఎస్.బి.ఎన్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ విద్యా సంస్థల పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు ఉద్యమ బాట పాట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కళాశాలలో చదవుతున్న విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ, నినాదాలు చేసారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ ఎయిడెడ్ కు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ చేయటానికి వీలు లేదు అంటూ, శాంతియుతంగా నిరసన తెలిపారు. ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినట్టు అయితే, వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తారని, అంత ఆర్ధిక స్థోమత తమకు ఉండదు అంటూ, పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, కాలేజి గేట్లు మూసేసి ఆందోళన చేస్తున్న విద్యార్ధుల పై విచక్షణ లేకుండా లాఠీ చార్జ్ చేసారు. దొరికిన విద్యార్ధులను దొరికినట్టు చితక బాదారు. విద్యార్ధి సంఘాల నేతలను ఈడ్చి పడేసారు. ఈ లాఠీ చార్జ్ లో పలువురు విద్యార్ధులకు తీవ్ర గా-యా-లు అయ్యాయి. విద్యార్థినులపై మగ పోలీసులు దా-డి చేసారు. ఈ సంఘర్షణలో ఒక విద్యార్ధిని తల పగిలింది. మీడియా కవరేజ్ ని కూడా పోలీసులు అడ్డుకోవటంతో, ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

atp 08112021 2

విచక్షణ లేకుండా పోలీసులు విద్యార్ధుల పై చేసిన లాఠీ చార్జ్ పై విద్యార్ధులు, మండి పడుతున్నారు. విద్యార్ధి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసులు తీరుని తప్పు బట్టారు. చివరకు విద్యార్ధుల పై కూడా జగన్ మోహన్ రెడ్డి తంటా కర్కసం చూపిస్తున్నారు అంటూ, టిడిపి విమర్శిస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విద్యార్థులపై లాఠీఛార్జ్ ను ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం పై నిరసన తెలపటం కూడా నేరమా అంటూ, ఇది మీ రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ ప్రశ్నించారు. ఇది జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం అని లోకేష్ అన్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని లోకేష్ అన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేసారు. ఈ ఘటన పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read