గత కొంత కాలంగా ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలు చేసిన ఆందోళనకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకోవాలని మొండి పట్టుదలతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, మంకు వీడారు. ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ఉద్యమాలతో, రాష్ట్ర ప్రభుత్వంలో చలనం కలిగింది. విద్యార్ధులు కూడా పోలీసులకు ఎదురు తిరుగుతూ ఉండటం, లాఠీ చార్జ్ లు చేసినా లెక్క చేయకపోవటంతో, ఈ అంశాన్ని ఇంతకు మించి లాగితే, అసలకే మోసం వస్తుందని అర్ధం చేసుకుంది. ఎయిడెడ్ విద్యా సంస్థల పై వెనక్కు వెళ్తూ, నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో కేవలం రెండు ఆప్షన్లకు మాత్రమే పరిమితం అయిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు నాలుగు ఆప్షన్లు ఇస్తూ, ఈ అంశం పై వెనక్కు తగ్గింది. గతంలో కేవలం రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయటం, రెండు ఉపాధ్యాయులను అప్పగించి వెనక్కు తగ్గటం, అటువంటి విద్యాసంస్థలకు ఎయిడ్ ఇవ్వం అంటూ, రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వీటి పైన గతంలో హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. మీరు ఎయిడ్ ఇవ్వం అని చెప్తే, ఆ విద్యా సంస్థలు ఎలా మనుగడ సాగిస్తాయని, ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

jagan 13112021 2

ఎయిడెడ్ విద్యా సంస్థలు, తమ సంస్థలను, టీచర్లను అప్పగించక పోయినప్పటికీ, ఎయిడ్ కొనసాగిస్తామని, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేత స్టేట్మెంట్ రికార్డు చేయింది హైకోర్టు. ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలకు, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. నిన్న నాలుగు ఆప్షన్లు ఇస్తూ, మడమ తిప్పింది. మొదటిది, ఆస్తులు, టీచర్లను ప్రభుత్వానికి ఇవ్వటం, రెండోది ఎయిడ్ ఇవ్వకుండా, ఆస్తులు మినహా సిబ్బందిని ఇవ్వటం, మూడో ఆప్షన్, ఏ రకమైన విలీనం చేయకుండా ప్రైవేట్ ఎయిడెడ్ గా కొనసాగటం, నాలుగోది గతంలో విలీనానికి అనుమతి ఇచ్చిన విద్యా సంస్థలు వద్దు అనుకుంటే, వారికి కూడా ఎయిడ్ కొనసాగిస్తామని చెప్పింది. రాత్రి ఈ అంశం పై ఉత్తర్వులు ఇచ్చింది. ఒక వేళ విద్యా సంస్థలు అంగీకరించకపోయినా, ఆ విద్యా సంస్థలకు ఎయిడ్ ఇస్తామని అంగీకరించింది. అయితే ఇప్పటికే సిబ్బందిని సరండర్ చేసిన వారిని ఏమి చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి విద్యార్ధుల ఒత్తిడితో, జగన్ మడమ తిప్పేలా చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read