Sidebar

06
Tue, May

పర్యటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో నవంబరు 23, 24, 25 తేదీల్లో విజయవాడలోని కృష్ణా నదీ తీరం పున్నమి ఘాట్‌లో విమాన విన్యాసాలు (ఎయిర్‌ షో) నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10.15 - 10.45 గంటల మధ్య, సాయంత్రం 4.15 - 4.45 గంటల మధ్య విన్యాసాలు ఉంటాయన్నారు. నవంబరు 16 నుంచి 18 వరకూ నిర్వహించే బోటు రేసింగ్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. 400 మంది బోటు రేసింగ్‌ రైడర్లు పాల్గొంటారని వివరించారు.

boating 20102018 2

ఎఫ్‌1 హెచ్‌2వో పవర్‌ బోట్‌ రేసింగ్‌ నిర్వహణ ద్వారా ప్రపంచ దృష్టిని అమరావతి వైపు ఆకర్షింపచేయాలని సీఎం చంద్రబాబునాయడు భావిస్తున్నారని పర్యాటక శాఖ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఎఫ్‌1హెచ్‌2వో నిర్వహణకు ప్రతి శాఖ నుంచి తాము సహకారం ఆశిస్తున్నామని మీనా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రకాశం బ్యారేజీ వేదికగా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడాపోటీలను నిర్వ హిసు ్తన్నామని, అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు ఒక్కో జట్టు నుంచి 50 మంది సభ్యులు చొప్పున 500 మంది జల క్రీడాకారులు వస్తున్నారని వివరించారు. ఎక్కువమంది పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన వారు, మీడి యాకు ప్రత్యేక గ్యాలరీలు నిర్మించాల్సి ఉందన్నారు.

boating 20102018 3

సాంస్కృతిక కార్యక్రమాలు, జలవ నరులు, పర్యాటక ప్రాధాన్యంపై మూడు రోజులపాటు కార్యగోష్టి నిర్వహిస్తున్నామని, శిల్పారామం నేతృత్వంలో క్రాప్ట్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహి స్తామని చెప్పారు. పోటీలు జరిగే విధా నం, రేస్‌ ట్రాక్‌కు సంబంధించిన అంశాలను శుక్లా వివరించారు. నగర సుందీకరణ అంశాన్ని తన బాధ్యతగా తీసు కుంటానని మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌ తెలపగా, జిల్లా యం త్రాంగం అంతటినీ అందు బాటులో ఉంచుతామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న బోట్‌ రేసింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై 30 శాఖల అధికారులతో సమీక్షించారు. సమయం తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపనున్నామని మీనా తెలిపారు. రేసింగ్‌లో ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించడంపై ప్రత్యేకంగా సమావేశంలో చర్చ జరిగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read