ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై, కేంద్రాన్ని నిందిస్తూ, చంద్రబాబుకు మద్దతుగా జాతీయ స్థాయిలో సపోర్ట్ వస్తుంది... చంద్రబాబు ఏ విధంగా అయితే, దేశం మొత్తం, మన సమస్యల పై, మనకు అండగా నిలవాలి అనుకుని, వ్యుహ్యం పన్నారో, దానికి తగ్గట్టుగా, చంద్రబాబుకి సపోర్ట్ గా, జాతీయ స్థాయిలో ఫస్ట్ వాయిస్ వినిపించింది... ఈ వాయిస్ వినిపించింది కూడా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీనే... మన రాష్ట్ర హక్కులనే కాదు, మోడీ వైఖరి, మిత్ర పక్షాలకు ఇస్తున్న గౌరవం గురించి కూడా ఎండగట్టారు...
ఆయన ఎవరో కాదు, శిరోమణి అకాలీదళ్ పరి ఎంపీ నరేశ్ గుజ్రాల్... ఈయన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ తనయుడు... ఇప్పుడు మన రాష్ట్రానికి అండగా నిలబడ్డారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తాను అన్నారు... ఇవ్వలేదు... స్పెషల్ ప్యాకేజి అన్నారు... కనీసం అదన్నా ఇవ్వాలి కదా అంటూ, ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు... రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నారు అని, మిత్రపక్షంగా, ఉంటూ, వారి వినతులు పట్టించుకోకపోతే ఎలా అని అన్నారు...
చంద్రబాబు ఏమి గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదు... మీరు చెప్పినవే అడుగుతున్నారు.. ఒక పక్క విభజన అన్యాయంగా జరిగింది... హైదరాబాద్ కి అన్నీ ఉన్నాయి... లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీదే కదా అంటూ, నరేశ్ గుజ్రాల్ అన్నారు.. అంతే కాదు, మోడీ సంకీర్ణ ధర్మం పాటించటం లేదు అని, లోకల్ గా ఉన్న బీజేపీ నాయకులు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని, ఇది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఉంది అంటూ, మోడీ పై విమర్శలు గుప్పించారు... నరేశ్ గుజ్రాల్, మనకు సపోర్ట్ గా మాట్లాడటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞత చెప్తున్నారు... సొంత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకుంటే, పక్క రాష్ట్రం వారు, మన హక్కుల కై, మన ముఖ్యమంత్రికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు...