భూమా కుటుంబం ప్రజా సేవకే అంకితమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం చాగలమర్రి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌కే ఓటు వేయాలన్న సంకల్పంతో ప్రజలు పట్టం కట్టారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి పెద్దఎత్తున అత్యధిక స్థానాలు వస్తాయని ఎవరూ ఊహించలేదని అన్నారు. ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటామని అన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని అన్నారు. దివంగత భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఆశయాలతో ప్రజలకు సేవ చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడం తథ్యమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొనసాగిన వైసీపీ హవా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండదని అన్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము అండగా ఉండి ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తామని అన్నారు.
తాము ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా నియో జకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఓడిపోయినా ప్రజలకు ఏ కష్టం రాకుండా సేవ చేస్తానని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం అహోబిలం పుణ్యక్షేత్రంలో చాగలమర్రికి చెందిన టీడీపీ నాయకులు గంగుల ప్రతాప్ ఏర్పాటు చేసిన శుభకార్యక్రమానికి మాజీ మంత్రి అఖిలప్రియ, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్ చైర్మన్ బీవీ రామిరెడ్డి, పుట్టాలమ్మ చైర్మన్ అంబటి మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ దంపతులు షష్టిపూర్తి చేసుకున్నందుకు మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.