‘‘అలహాబాద్‌ యూనివర్సిటీలో విద్యార్థి నేత ప్రమాణ స్వీకారానికి బయలుదేరాను. కానీ, లఖ్‌నవూ విమానాశ్రయంలోనే నన్ను పోలీసులు అడ్డుకున్నారు. అలహాబాద్‌ వెళ్లకుండా నిలిపివేశారు. విద్యార్థి నేత ప్రమాణ స్వీకారాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోంది’’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ట్విటర్లో పేర్కొన్నారు. యూనివర్సిటీలో కార్యక్రమం తర్వాత కుంభమేళాకు వెళ్లాలని భావించానని, అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్లో ఆయన పోస్ట్‌ చేశారు. ఎటువంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండానే విమానం ఎక్కకుండా అడ్డుకున్నారన్నారు. ఈ అంశం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. అఖిలేశ్‌ను అడ్డుకోవడంపై ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ దద్దరిల్లింది. తమ నేతను అడ్డుకున్నారని తెలిసిన వెంటనే, అసెంబ్లీలో ఎస్పీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

akhilesh 13022019

ఎస్పీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే, అఖిలేశ్‌ పర్యటనతో యూనివర్సిటీలోని ప్రత్యర్థి విద్యార్థి సంఘాల మధ్య హింస చెలరేగే అవకాశం ఉందని అలహాబాద్‌ వర్సిటీ ఆందోళన వ్యక్తం చేసిందని, ఆయన పర్యటనను నిలుపు చేయాలని కోరిందని, ఆ మేరకే ప్రభుత్వం స్పందించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. కేంద్రం జోక్యంతోనే తనను అడ్డుకున్నారని.. ఎయిర్‌పోర్టు కేంద్ర భద్రతా బలగాల చేతిలో ఉంటుందని, అక్కడికి పోలీసులు రాలేరని అఖిలేశ్‌ గుర్తు చేశారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తును చూసి ప్రభుత్వం భయపడుతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు.

 

akhilesh 13022019

యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్‌ పట్ల లక్నో అధికారులు వ్యవహరించిన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు అన్నారు. కాగా అఖిలేష్‌ యాదవ్‌, చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. దీక్షాస్థలికి రాలేకపోయానని, తన మద్దతు ఉందని అన్నారు. త్వరలో కలిసి అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థుల సమావేశానికి అఖిలేష్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయనను అక్కడికి వెళ్లకుండా యూపీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడంపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ 'కుట్ర' చేస్తోందంటూ మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read