రాష్ట్రంలో ఇసుక సమస్య, ప్రతిపక్షాలు అన్నిటినీ ఏకం చేస్తుంది. 2014లో మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అప్పటి ఎన్నికల్లో లాభ పడ్డారు. 2019 ఎన్నికలకు వచ్చేసరి, విడివిడిగా పోటీ చేసి, అందరూ నష్టపోయారు. అయితే ఎన్నికలు పక్కన పెడితే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్న వైసిపీ ప్రభుత్వం పై, కలిసి పోరాటాలు చేస్తూనే, ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుందని, ప్రజలకు మేలు జరుగుతుందని, మూడు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నాయి. గడిచిన ఆరు నెలలుగా, వైసీపీ ప్రభుత్వం, ప్రజల జీవితాలతో ఇష్టం విచ్చినట్టు చెలగాటం ఆడుతుంది. అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అయితే, మొన్నటి వరకు, ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎవరికి వారు, విడి విడిగా ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెంచి, ప్రజా సమస్యలు పరిష్కరించటానికి, ఇసుక కొరత సమస్య పై, పార్టీలు అన్నీ ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నాయి.

knna 11112019 2

విశాఖపట్నంలో జరిగిన లాంగ్ మార్చ్ కార్యక్రమం, జనసేన ఆధ్వర్యంలో జరిగింది. అయితే అంతకు ముందే, పవన్ కళ్యాణ్, అన్ని రాజకీయ పార్టీలకు ఫోన్లు చేసి, కలిసి పోరాడదాం అని, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, లోక్ సత్తా పార్టీలకు ఫోన్లు చేసి మద్దతు అడిగారు. కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం, బీజేపీ వల్ల కలిసి రాలేం అని చెప్పగా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, లోక్ సత్తా మద్దతు పలికాయి. తెలుగుదేశం పార్టీ తరుపున, మాజీ మంత్రులు, అయ్యన్నపాత్రుడు, అచ్చెం నాయుడు, వెళ్లి, జనసేన కార్యక్రమంలో పాల్గున్నారు. బీజేపీ సపోర్ట్ ఇచ్చినా, ఎవరినీ ఈ కార్యక్రమానికి పంపించలేదు. ఇప్పుడు, రేపు 14న, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇసుక కోసం దీక్ష చెయ్యనున్నారు.

knna 11112019 3

ఈ దీక్ష కోసం, అన్ని రాజకీయ పార్టీలను మద్దుతు కోరుతున్నారు. ప్రతిపక్షాలు అన్నీ ఐక్యంగా కలిసి పోరాటం చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా, తెలుగుదేశం పార్టీ బీజేపీ మద్దతు కూడా కోరింది. కన్నా లక్ష్మీనారాయణ వద్దకు, తెలుగుదేశం పార్టీ తరుపున, ఆలపాటి రాజా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రేపు 14న చేపట్టబోయే దీక్షకు, మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పై ఎవరూ పోరాడినా తమ సంఘీభావం ఉంటుందని,గతంలోనే చెప్పమని, ఇలాగే పవన్ కళ్యాణ్ కు కూడా మద్దతు ఇచ్చామని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీక్షకు కూడా మద్దతు తెలుపుతున్నామని కన్నా అన్నారు. మా మద్దతు దీక్ష వరుకే అని, తెలుగుదేశం పార్టీతో రాజకీయ పొత్తు కాదని కన్నా అన్నారు. మొత్తానికి, జగన్ పుణ్యమా అని, మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోరాటాలు మొదలు పెట్టాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read