15ఏళ్ల తర్వాత రేపు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగనుంది. మోదీ సర్కార్‌పై టీడీపీతో సహా ఇతర విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో దేశ రాజకీయాలు హాట్‌‌హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్డీయే ప్రభుత్వాన్ని పడగొట్టేంత మ్యాజిక్ ఫిగర్ విపక్షాలకు లేకపోయినప్పటికీ ఏపీకి జరిగిన అన్యాయాన్ని మరోసారి దేశ ప్రజలకు వివరించే అవకాశం దక్కిందని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం వైఖరిని ఎండగట్టిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కే ఈసారి కూడా అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీడీపీ తరపున తొలుత మాట్లాడే అవకాశం దక్కింది. మరో పక్క, అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ తమ ఎంపీలకు విప్‌లు జారీచేయగా.. ఈ రోజు శివసేన, బీజేడీ పార్టీలు తమ ఎంపీలకు విప్‌ జారీచేశాయి.

party 19072018 2

అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన తెదేపా.. ఈ చర్చ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం వైఫల్యాన్ని ఎండగట్టడంతో పాటు, విభజన హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా తాత్సారం చేస్తూ వచ్చిన తీరును దేశ ప్రజలముందు ఉంచేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు భాజపా కూడా ఇప్పటివరకు రాష్ట్రానికి ఏమేం ఇచ్చాం? విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలు, నిధుల కొరతకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ పథకాలు, హామీల కింద రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయాన్ని వివరించేందుకు సిద్ధమవుతోంది. మరో పక్క, శివసేన, అన్నాడీఎంకే మిగిలిన పక్షాలతో భాజపా సంప్రదింపులు కొనసాగిస్తోంది. దానికి తగినట్టుగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ రోజు ఫోన్‌లో మాట్లాడారు.

party 19072018 3

మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, బీజేపీని దెబ్బ కొట్టే ప్లాన్ వేసింది. వాస్తవానికి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి పెద్ద బలమేమీ లేదు. అయినా యూపీలో మారిన పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన బైపోల్స్‌లో ఎస్పీ, డీఎస్పీ కూటమి బీజేపీ సిట్టింగ్ స్థానాలను కొల్లగొట్టింది. ఇప్పుడు అవిశ్వాసం సందర్భంగా బీజేపీ యూపీ ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఈ లోక్‌సభ పదవీకాలం ఇంకా ఏడాది కూడా లేదు. ఇప్పుడు తమకు సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ తరపున టిక్కెట్లు ఇస్తామంటూ యూపీ బీజేపీ ఎంపీలకు మాయావతి గేలాం వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీలోని దళిత ఎంపీలను తనవైపు తిప్పుకునేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నారు. అటు ఒడిస్సాలో అధికార బీజేడీ మాత్రం రేపు ఓటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయించింది. లోక్‌సభలో బీజేడీకి 19 మంది సభ్యులు ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read