ఈ మధ్య కొంచెం మెంటల్ బ్యాలన్స్ తప్పి, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ప్రజలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా, చంద్రబాబు పై విర్రవీగుతున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఈ రోజు మరోసారి రెచ్చిపోయారు ... అయితే ఈ సారి అనూహ్యంగా, రాష్ట్రంలోని అన్ని పార్టీలు వీర్రాజుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాయి... తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే... ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడమనేది ముమ్మాటికీ మోసమేనంటూ బీజేపీ నేతలపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. రాం మాధవ్ చెప్పినట్టు రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

somu 23022018 2

అలాగే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ, సోము వీర్రాజు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా తరుచూ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు కోట్ల మందికి విరుద్ధంగా ఆయన మాట్లాడడం సరికాదని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. కారణాలేమైనా ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కారు చేస్తోన్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం గళం ఎత్తడం, ఎంపీలతో పార్లమెంటులో ఆందోళన చేయించడం మంచి పరిణామమే అని అన్నారు. కానీ, సోము వీర్రాజు మాత్రం కాకమ్మ కథలు చెబుతూ మభ్యపెట్టాలనుకుంటున్నారని అన్నారు.

somu 23022018 3

మరో పక్క, ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూడా విమర్శించారు.. దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు... భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే బీజేపీ మంత్రులిద్దరూ రాష్ట్ర కేబినెట్‌ నుంచి వైదొలగాలని ఆయన సవాల్ చేశారు... బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు ఏజంట్‌గా మాట్లాడుతున్నాడని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రాన్ని పడగొట్టాలని భావించే వారికి వైఎస్ జగన్, సోము వీర్రాజులు సహకరిస్తున్నారని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి మద్దతిస్తున్నారని వెంకన్న విమర్శలు గుప్పించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read