ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన హామీలను నెరవేర్చాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం చేపట్టనున్న "ధర్మపోరాట దీక్ష" కు ఢిల్లీ లోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రాంగణంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు చేపట్టనున్న "ధర్మపోరాట దీక్ష" ఏర్పాట్లను ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్, శాసనమండలి సభ్యులు సత్యనారాయణ రాజు, ఎపి భవన్ కమీషనర్ డా. అర్జా శ్రీకాంత్, ఎపి భవన్ ఓఎస్ డి. శ్రీమతి భావన సక్సెనాలతో కలసి ఎపి భవన్ అధికారులు, సిబ్బంది, తెలుగు సంఘాల ప్రతినిధులతో ఏర్పాట్లను సమీక్షించారు.

dharmaporatam 09022019

దీక్షలో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా సకల ఏర్పాట్లను పూర్తిచేయాలని ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా భవన్ అధికారులు, సిబ్బందికి విశదీకరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టనున్న ధర్మపోరాట దీక్ష విజయవంతం చేయుటకు అధికారులు, సిబ్బందిని సమాయత్త పరచారు. రాష్ట్రం నుంచి తరలివస్తున్న వారికి ముందుగా గుర్తించిన హోటల్స్, ఇతర భవనాలలో ఏర్పాటు చేస్తున్న బస ఏర్పాట్లను, వారికి అవసరమైన భోజనవసతి, రవాణా సౌకర్యాలలో ఏవిధమైన లోపం లేకుండా చూడాలని భవన్ సిబ్బందికి సూచించారు.

dharmaporatam 09022019

ప్రధాన దీక్షా వేదిక వద్ద అవసరమైన పెండాల్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసు రక్షణ వలయం, మంచినీటి సరఫరా, మీడియా లాంజ్, ప్రసారమాధ్యమాల ద్వార ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ తగు సూచనలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలివస్తున్న ప్రజలతోపాటు దేశ రాజధానిలోని తెలుగు ప్రజలు విరివిగా పాల్గొనేలా స్థానిక తెలుగు సంఘాలు తమవంతు చేయూతనిచ్చి సహకరించాలని రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. 11వ తేది సోమవారం ఉదయం 7గంటలకు రాజఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్సించి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ భవన్ కు చేరుకొని డా. బి. ఆర్. అంబెడ్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి అంజలిఘటించి భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట దీక్ష ప్రధాన వేదికపై ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు "ధర్మపోరాట దీక్ష" చేపట్టనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read