ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి..జగన్ కు తొలి నుండి విధేయుడిగా ఉన్న మంగ ళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. దీని కోసం గత ప్రభుత్వం చేసిన చట్టంలో అవసరమైన మార్పులను చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ మీద గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆయన గెలిచినా..సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో..ఇప్పుడు ఆయనకు కీలకమైన సీఆర్డీఏ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కీలక పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. రాజధాని వ్యవహారాలను పర్య వేక్షించే సీఆర్డీఏ బాధ్యతలను ఆర్కేకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు.
అందులో భాగంగా సీఆర్డీఏ ఛైర్మన్‌గా ఆళ్ల నున నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ నిమాయకానికి సంబంధించి చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు హయాంలో సీఆర్డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉండే విధంగా బిల్లు ను ఆమోదించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకుండా.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించాలంటే ఖచ్చితంగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అవసరమైన విధి విధానాలను పూర్తి చేసి త్వరలోనే ఆయనకు కీలకమైన ఈ నామినేటెడ్ పోస్టును అప్పగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రక్రియ ను పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఆళ్ల రామకృష్నారెడ్డి తాజా ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేసారు. ఆయన 2014 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుండి గెలుపొందారు.
మంగళగిరి నుండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి లోకేశ్ పోటీ చేసారు. ఆళ్ల రామకృష్నారెడ్డిని మంగళగిరి నుండి గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ మంగళగిరిలో ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. అయితే, మంత్రివర్గ విస్తరణ సమయంలో తొలుత ఆర్కే పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ, గుంటూరు జిల్లాలో ఎస్సీ-బీసీ సామాజిక వర్గాలకు అవకాశంతో పాటుగా.. ఇదే జిల్లాలో జగన్ మరో హామీ పెండింగ్‌లో ఉంది. మర్రి రాజశేఖర్‌కు సైతం మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దీంతో..చివరి నిమిషంలో ఆర్కేకు మంత్రి పదవి నిలిచిపోయింది. ఆర్కే వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంటూనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనేక అంశాల్లో కోర్టుల్లో కేసులు వేసి న్యాయ పోరాటం చేసారు. ర్కే సోదరుడు ఆయోధ్య రామిరెడ్డి గతం ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా..ఆయన బావ మోదుగుల వేణుగోపాల రెడ్డి తాజా ఎన్నికల్లో గుంటూరు ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో..ఆర్కేకు సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.