12 ఓట్లతో గెలిచాను, ఇక నియోజకవర్గ సమస్యలు ఎందుకు అనుకున్నాడో ఏమో, పనీ పాట ఏమి లేనట్టు, ఎక్కడ లిటిగేషన్ ఉంటే, అది పట్టుకుని కేసులు వేసి, ఎప్పుడూ కోర్ట్ ల చేత మొట్టికాయలు తింటా ఉంటాడు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మల్యే, జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి... అమరావతి మీద ఎన్ని కేసులు వేసాడో చూసాం, పేదలకు ఇచ్చే ఫైబర్ నెట్ మీద కేసులు, సాధావర్తి భూముల పై కేసులు వేసి, ప్రభుత్వానికి రూపాయ్ ఆదాయం రాకుండా చేసాడు... ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక పై పడ్డాడు... మొన్నా మధ్య జగన్, ప్రధానిని కలిసినప్పుడు, ఈడీ అధికారుల మీద ఫిర్యాదు చేసాడు అని జ్యోతి రాసింది...

alla 19022018 2

బయటకు వచ్చి ప్రజల కోసం ఎదో ప్రధానితో మాట్లాడినట్టు బిల్డ్ అప్ ఇచ్చాడు జగన్... అయితే, ఆంధ్రజ్యోతి తన కేసుల కోసమే, జగన్ కలిసాడు అని, అప్పుడు ప్రాధానికి ఇచ్చిన లేఖ కూడా బయట పెట్టింది... దీని పై జగన్ తరుపున, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మా జగన్ అన్న పరువు పోయింది అని, ఆంధ్రజ్యోతి పై చర్యలు తీసుకోమని, సుప్రీం కోర్టుకు వెళ్ళితే, ఈ పిటిషన్, అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించలేదు. గతంలో ఇదే పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆంధ్రజ్యోతి వార్తలో పరువునష్టం కలిగించే అంశాలేవీ కన్పించడంలేదని ఇలాంటి వార్తలు సహజమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఆళ్ల రామృష్ణారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు.

alla 19022018 3

ఆళ్ల పిటిషన్‌పై సుప్రీంలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు కల్వన్‌కర్, డీవై చంద్రచౌద్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఆళ్ల తరపున ప్రముఖ న్యాయవాది జయంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంలో తన పార్టీ అధినేతను తప్పుడుగా చూపించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞాపన పత్రం ఇస్తే... తప్పుడుగా ప్రచారం చేశారంటూ ఆళ్ల తరపున జయంత్ భూషణ్ వాదించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా ప్రస్తావించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఆంధ్రజ్యోతి కథనంలో పరువునష్టానికి సంబంధించిన అంశాలేవి కనిపించలేదంటూ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించారు. అయినా, ప్రజలందరికీ తెలుసు కదా, జగన్, మోడీని ఎందుకు కలిసాడో... ఎంత మంది మీద పరువు నష్టం దావా వేస్తారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read