గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికను వాయిదా వేయాలి అంటూ, తెలుగుదేశం పార్టీ ఎంపిపి అభ్యర్ధి షేక్ జబీన్ వేసిన పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. జబీన్ కుల ధృవీకరణ పత్రం పై తగిన నిర్ణయం తీసుకోవాలని, కలెక్టర్ ని హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, కుల ధృవీకరణ పత్రం ఇవ్వటానికి వారం రోజులు గడువును హైకోర్టు ఇచ్చింది. కుల ధృవీకరణ పత్రం ఇచ్చిన తరువాత మాత్రమే ఎంపిపి ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దుగ్గిరాల మండంలో మొత్తం 18 MPTC స్థానాలు ఉండగా, తెలుగుదేశం తొమ్మిది, వైసీపీ ఎనిమిది, జనసేన ఒక్క స్థానం గెలిచుకుంది. బీసిలకు ఎంపిపి పదవి రిజర్వ్ కాగా, తెలుగుదేశం నుంచి గెలిచిన ఏకైక ఎంపిపి అభ్యర్ధి జబీన్ కు కుల ధృవీకరణ పత్రం ఇవ్వటంలో అధికారులు ఆలస్యం చేసారు. ఇప్పటికే ఎన్నిక కావాల్సిన ఎన్నిక రెండు సార్లు వాయిదా పడింది. తమ అభ్యర్ధికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవటంతో, టిడిపి సభ్యులు హాజరు కాలేదు. కోరం లేకపోవటంతో రెండు సార్లు ఈ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు వరకు ఈ విషయం వెళ్ళటం, వారం రోజుల్లోగా కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని, అప్పటి వరకు ఎన్నిక జరపవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే తెలుగుదేశం నేతలు, మాత్రం వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనా కూడా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, అధికారులు కూడా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏది చెప్తే అది చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కుల ధృవీకరణ పత్రం ఇవ్వటానికి ఇంత సమయం ఎందుకు, ఇన్ని నాటకాలు ఎందుకు అంటూ టిడిపి నేతలు అంటున్నారు. తమ అభ్యర్దులను లోబరుచుకోవటానికి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నో ఎత్తులు వేసారని, తమ అభ్యర్దులు ఎక్కడా లొంగక పోవటంతో, ఇప్పుడు దొడ్డి దార్లు తొక్కుతూ ఎంపీపీ పదవి కోసం, అడ్డదార్లు తొక్కుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అరాచకాలు ఎదుర్కుంటామని ధీమాగా చెప్తున్నారు. మరో పక్క ఈ రోజు హైకోర్టు తీర్పుతో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ అనే చెప్పాలి. ఈ వ్యవహారం పై, తదుపరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమి చేస్తారో చూడాలి.