రౌడీ పార్టీగా పేరు ఉండి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీవ్ర పదజాలంతో తిడుతూ, మీ అంతు చూస్తూ, మిమ్మల్ని జైలుకి తీసుకుపోతా అంటున్నాడు A1.... A2 అయితే, కొంత మంది అధికారులు పేర్లు చెప్పి మరీ, వీరు మా హిట్ లిస్టు లో ఉన్నారు, మా A1 సియం అయిపోతున్నాడు, సియం అవ్వగానే, వీరి సంగతి చూస్తాం అంటున్నాడు.. తిరుపతిలో ఉండే ఒక స్మగ్లర్ ఏమో, ఉరికించి ఉరికించి కొడతాం అంటాడు.. ఇప్పుడు లిస్టు లో మంగళగిరి ఎమ్మల్యే చేరాడు... ఈయన విమర్శలు చేసింది, అత్యంత నీతి వంతమైన ఆఫీసర్ గా పేరు ఉన్న, ఏసీబీ డైరెక్టర్‌ ఆర్పీ ఠాకూర్ పై... బినామీ ఆస్తుల కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఏసీబీ ముందు హాజరవ్వమన్నందుకు, ఈయన పై విమర్శలు చేసాడు ఆళ్ళ.. విమర్శలు చేసి, జగన్ పరువు నిలబెట్టాడు..

acb 06062018 2

ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం మండిపడింది. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె. శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పోలీసులపై ఆర్కే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఆర్పీ ఠాకూర్ ఏసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక అవినీతిపరుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో కనిపించడం లేదా? అన్ని ప్రశ్నించారు. ఆర్పీ ఠాకూర్‌కు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

acb 06062018 3

రాజకీయాలతో పోలీసులను టార్గెట్ చేయడం బాధాకరమన్నారు. ఐపీఎస్‌కు ఎలా సెలక్ట్‌ అవుతారో కూడా తెలియని రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యేగా ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎంతో సామర్థ్యం ఉంటేనే సివిల్‌ సర్వీస్‌కు ఎంపిక అవుతారని గుర్తుచేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఆయన సహకరించాలన్నారు. పలు కారణాలతో రెండు సార్లు విచారణకు గైర్హాజరైన ఆళ్ల సోమవారం ఉదయం ఏసీబీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కి చెందిన అక్రమాస్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఏబీసీ గుర్తించింది. దీనిపై విచారణకు రావాల్సిందిగా ఏసీబీ ఆళ్లకు నోటీసులు జారీ చేసింది. కాగా రెండు సార్లు తన తరపున న్యాయవాదులను పంపిన ఎమ్మెల్యే మూడో సారి స్వయంగా ఏసీబీ ముందు హాజరయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read