రాష్ట్రంలో గత నెల రోజులుగా వైసీపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అనేక సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. దీంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అయితే, ఇప్పుడు దీని నుంచి డైవర్ట్ చేయటానికి అని చెప్పినట్టు, ఇప్పటికే కోర్టులో స్టే ఇచ్చిన అంశం పై, మరోసారి అమరావతి దళితుల భూములు అంటూ వైసీపీ నేతలు ఎత్తుకున్నారు. చంద్రబాబు, మంత్రి నారాయాణ, అదే విధంగా అప్పట్లో ఉన్న ఇతర అధికారులు, దళితుల వద్ద నుంచి భూమి తీసుకుని, అసైన్డ్ భూములు అని తెలిసినా, తమ పేరున రాపించుకున్నారు అంటూ ఆరోపణలు చేసారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అసైన్డ్ భూమి కాబట్టి, మీకు ఎటువంటి పరిహారం రాదనీ బెదిరించారని, బెదిరించి దళితుల దగ్గర నుంచి భూములు లక్కున్నట్టు ఆరోపణలు చేసారు. అలాగే దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయి అంటూ, ఒక వీడియో ప్లే చేసారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే ఆ వీడియో ఇప్పుడు తిరిగి తిరిగి ఆళ్ళకే చుట్టుకుంది. ఇది తిరిగి ఆళ్ళకే చుట్టుకోవటంతో, ప్లాన్ మొత్తం అడ్డం తిరగింది. ఆ వీడియోలో ఉన్న రైతులు, ఆళ్ళ ఆరోపణలు తిప్పి కొట్టారు. ఆళ్ళ చెప్తున్నది అంతా అబద్ధం అంటూ తీసి పడేసారు. ఇది కేవలం అమరావతి పై మళ్ళీ బురద చల్లటం కోసం, వైసీపీ నేతలు పన్నిన పన్నాగంగా, అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు.
ఉద్దండరాయుని పాలెంకు చెందిన పూల రవి అనే రైతు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకుండా, పక్కన ఉన్న మరో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తూ, 8 నిమిషాల వీడియో ఏదైతే రిలీజ్ చేసారో, ఆ వీడియో పై కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియోలో దళిత రైతులు కొంత మంది, తమ భూములను అగ్రిమెంట్ చేసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ దృశ్యాల్లో ఉన్న పూల రవి, ఆళ్ళ ఆరోపణల పై కౌంటర్ ఇచ్చారు. అసలు మీము ఎవరం ఆళ్ళ దగ్గరకు వెళ్లలేదని, ఆయన ఎందుకు పులుముకుంటున్నాడు అంటూ ప్రశ్నించారు. మా భూములు బలవతంగా లాక్కుంటే, వారి పేరున వెళ్లిపోవాలి కదా అని ప్రశ్నించారు. ఇప్పటికే భూములు మా పేరు మీదే ఉందని, మేమే సాగు చేసుకుంటున్నాం అని అన్నారు. మాకు ఎకరం 60 సెంట్లు ఉంటే, 60 సెంట్లు అమ్ముకున్న అగ్రిమెంట్ అని, మేము సంతోషంగా ఉన్నాం అని ఆ వీడియో చుస్తే అర్ధం అవుతుందని, అగ్రిమెంట్లు అన్నీ, కాగితాలు అన్నీ ఉన్నాయని, పొలాలు అన్నీ మా పేరునే ఉన్నాయని, అసలు మీకెందుకు అని, మా వీడియోలు ఎలా వాడుకుంటారు అంటూ, రైతులు ఎదురు తిరిగారు. ముందు మాకు ఇవ్వాల్సిన కవులు ఇవ్వండి అంటూ ప్రశ్నించారు.