సివిల్ సప్లై మంత్రికి పేరుకు మాత్రమే పదవి కట్టబెట్టారు. కానీ ఆయన పనిమాత్రం సొంత సామాజికవర్గాన్ని తిడుతూ, జరిగే వాటిని పక్కదారి పట్టించేందుకు అనధికార పదవిని కట్టబెట్టారు. సివిల్ సప్లైకి సంబంధించి కొడాలి నాని ఏనాడూ మాట్లాడలేదు. ఈ శాఖలో విపరీతంగా కుంభకోణాలు చేస్తూ వేలాది కోట్లు వెనకేసుకుంటూ, రాష్ట్రంలో జరిగే అనేక అంశాలను పక్కదారి పట్టించేందుకు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలు చూస్తే బూతుల మంత్రికి వేల కోట్లు సంపాదన వచ్చే పదవి ఇచ్చాము, నీవళ్ల ఏమీ కావడం లేదు, నీ పదవి తీసే సమయం వచ్చిందన్న సంకేతాలు ఇచ్చారు. దీనికి నిదర్శనం సివిల్ సప్లై గురించి ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలే. సివిల్ సప్లై శాఖ నిద్రపోతోందా.? సివిల్ సప్లై శాఖలో విపరీతంగా అవినీతి జరుగుతోంది, బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని, తన నియోజకవర్గంలో వారంలో రెండు మూడు లారీలు బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని ఆర్కే అన్నారు. కుంభకోణాలకు దారి తీస్తున్నట్లు ఆళ్ల మాట్లాడారు. కొడాలి నానికి శాఖ అప్పగించినప్పటి నుండి జరిగే అవినీతిపై మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటే కావాల్సినంత పర్ఫార్మెన్స్ బూతుల మంత్రి ఇవ్వలేక పోతున్నారు. బూతుల్ని ప్రజలు తిప్పి కొడుతున్నారని శాఖను తీసే వేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆళ్ల ఒక్కో నియోజకవర్గానికి 3 లారీల చొప్పున అవినీతి బియ్యం పోతున్నాయన్నారు. 175 నియోజకవర్గాల్లో వారానికి 3 లారీల చొప్పున 525 లారీలు, నెలకు 2,100 లారీల అక్రమంగా బియ్యం తరలించ బడుతున్నాయి. ఇది ఆళ్ల లెక్కల ప్రకారమే చెప్తున్నాం. ఇది సాధారణంగా జరిగే అవినీతి. ఒక్కో లారీకి రూ.6-రూ.10 లక్షలకు అమ్ముతున్నారు. నెల్లూరులో కూడా బియ్యం అక్రమ రవాణాపై కథనాలు వచ్చాయి. పాత్ర దారైన కోదండరామి రెడ్డి సంచుల్లో నింపడానికి చేసిన వ్యక్తే ఇదంతా చేశారు. రూ.4 వేల కోట్ల రూపాయల బియ్యం పట్టుబడ్డాయి. అంతా సక్రమం అయితే అక్రమం ఎక్కడ. పక్క దేశాలకు బియ్యం తరలిపోతున్నాయి. దళితుల మీద దా-డు-లు జరిగినప్పుడు పక్కదారి పట్టించేందుకే కొడాలిన నాని బయటకు వస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మొత్తం బియ్యాన్ని పేదలకు అందించాలి. అంతక ముందు డీలర్లు సంచుల్లో పోసి లెక్క ప్రకారం బియ్యం అందించేదవారు.

కానీ వీళ్లు వాహన సిస్టం తీసుకొచ్చారు. వాహనాల ద్వారా ఇంటింటికీ పంచుతామని చెప్పారు. ఇంటింటికీ వాహనాలు వెళ్లడం లేదు..ఎక్కడో ఓ మూలన వాహనాలు ఆగితే వాటి దగ్గరకెళ్లి జనం బియ్యం తెచ్చుకోవాలి. మరి ఈ వాహనాలు ఎందుకు ప్రవేశపెట్టారు. వినియోగదారుల సౌకర్యార్థం వాహనాలు తెచ్చామని చెప్తున్నారు. 50 కేజీల బియ్యం బస్తా నుండి 5 కేజీలు నొక్కేస్తున్నారు. ఈ వాహనాలే అక్రమ బియ్యం రవాణా తరలించేందుకు ఉపయోగ పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి వెహికల్ కు నంబర్ వుంటుంది..కానీ జగన్ రెడ్డి ఇచ్చిన బియ్యం వాహనాలకు నంబర్లు లేవు. డీలర్ల నుండి నంబర్లు లేని వాహనాల్లో ఎక్కించి అక్రమ రవాణా చేసే ప్రాంతానికి తరలిస్తారు. గతంలో రైసు మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శ్రీరంగనాథరాజు, మంత్రి కొడాలి నాని ఇదంతా చేస్తున్నారు. అక్రమాలు, రౌడీ యిజం చేసేవాళ్లకు మంత్రి పదవులు ఇస్తున్నారు. ద్వారంపూడి భాస్కర్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు. ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని కొడాలి నానితో సామాజిక వర్గాన్ని తిట్టిస్తూ శ్రీరంగనాథరాజు నుండి ద్వారంపూడి వద్దకు వస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం 89 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 59లక్షల కార్డులకు బియ్యం ఇస్తోంది. ప్రతి కేజీలో అవినీతి జరుగుతోంది. వేల కోట్ల రూపాయల పేదల సొమ్మును బొక్కుతున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన బియ్యం పంపిణీ వ్యవస్థలో అక్రమాలు చేస్తున్నారు. వారంలో నియోజకవర్గం నండి 6-7 లారీల బియ్యం వెళ్తోంది. కొడాలి నానిని పదవి నుండి తప్పించాలి. పేదల బియ్యంతో వేల కోట్ల రూపాయల అవినీతి జరగుతోంది. ఇసుక, మైనింగ్, లిక్కర్ లో వేల కోట్లు దోచుకుంటున్నారు. సిట్టింగ్ జడ్జితో రేషన్ బియ్యంపై విచారణ చేయించాలి. కొడాలి నాని, ద్వారంపూడి భాస్కరరెడ్డి, శ్రీరంగనాథరాజు పై చర్యలు తీసుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read